సాల్ట్ లేక్ లో కేకపుట్టించిన హృతిక్

April 08, 2015 | 10:24 AM | 77 Views
ప్రింట్ కామెంట్
hritik_dance_performance_at_IPL_starting_ceremoney_niharonline

కోల్ కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంను బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ ఉర్రూతలూగించాడు. ఐపీఎల్ ప్రారంభ వేడుకల సందర్భంగా బాలీవుడ్ స్టార్లు షాహిద్ కపూర్, అనుష్క శర్మ, ఫర్హాన్ అక్తర్ లు ప్రదర్శన అనంతరం వేదికనెక్కిన హృతిక్ స్టేడియం మొత్తంను ఊగేలా చేశాడు. ఎక్ పల్ కా జీనా పాటతో మొదలెట్టి తన ఎనర్జీతో అభిమానుల్లో జోష్ పెంచాడు. గతంలో ప్రభుదేవా న్రుత్యరీతులు సమకూర్చిన పాటలకు అదిరిపోయే స్టెప్పులేసిన హృతిక్ తనదైన శైలిలో అభిమానులను అలరించాడు. హృతిక్ డాన్స్ వేస్తున్నంత సేపూ అరుపులు, కేకలతో స్టేడియం మోత మోగిపోయింది. హోలీ రంగులు, దీపావళి కాంతులు, ఈద్ సంబరం, క్రిస్టమస్ వేడుక కలగలిపి పెప్సీ ఐపీఎల్ లో ఉన్నాయని హృతిక్ పేర్కొన్నాడు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ