ధావన్ సెంచరీ... ఐర్లాండ్ పై టీమిండియా విక్టరీ

March 10, 2015 | 03:04 PM | 97 Views
ప్రింట్ కామెంట్
india_ninth_constructive_victory_in_WC_niharonline

వరుస విజయాలతో జోరు మీదున్న భారత్ ఖాతాలోకి మరో విజయం వచ్చి చేరింది. ఢాషింగ్ ఓపెనర్ ధావన్ సెంచరీతో పాటు రోహిత్ అర్థసెంచరీ చేయటంతో మంగళవారం ఐర్లాండ్ తో జరిగిన లీగ్ మ్యాచ్ లో ఘన విజయం సాధించింది. 260 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన భారత్ ధావన్-రోహిత్ విలువైన భాగస్వామ్యంతోపాటు చివర్లో కోహ్లీ, రహానే మెరుపులతో విజయం తీరాలకు సునాసయంగా చేరుకుంది. అంతకుముందు టాస్ గెలిచిన ఐర్లాండ్ జట్టు బ్యాటింగ్‌ను కెప్టెన్ విలియమ్ ఫోర్టర్ ఫీల్డ్ (67), పాల్ స్టిర్లింగ్‌ (42)లు ప్రారంభించారు. వచ్చీరాగానే ఫోర్టర్ ఫీల్డ్ తాను ఎదుర్కొన్న నాలుగో బంతినే బౌండరీ దాటించాడు. ఆ తర్వాత ఈ ఇద్దరు ఓపెనర్లు తొలి వికెట్‌కు 15 ఓవర్లలో 89 పరుగుల భాగస్వామ్యం కల్పించారు. వీరిద్దరు క్రీజ్‌లో ఉన్నంతసేపు భారత బౌలర్లు హడలెత్తి పోయారు. అయితే, స్పిన్ బౌలింగ్ దెబ్బకు వీరి భాగస్వామ్యం విడిపోక తప్పలేదు. అశ్విన్ బౌలింగ్‌లో స్టిర్లింగ్ తన వ్యక్తిగత స్కోరు 42 పరుగుల వద్ద ఔట్ అయ్యాడు. ఆ తర్వాత క్రమం తప్పకుండా వికెట్లు పడటంతో ఆ జట్టు 259 పరుగులకే ఆలౌట్ అయింది. చిన్నదిగా ఉన్న మైదానం, బ్యాటింగ్‌కు అనుకూలించే పిచ్ కావడంతో ఐర్లాండ్ ఓపెనర్లు ఆరంభంలో ధాటిగా బ్యాటింగ్ ప్రారంభించారు. కానీ, భారత స్పిన్ ముందు వారి పప్పులు ఉడకలేదు. కాగా, ఐర్లాండ్ స్టార్ బ్యాట్స్ మెన్ ఓబ్రియాన్ 75 పరుగులతో మరోసారి రాణించాడు. భారత బౌలర్లలో షమీ 3 వికెట్లు తీయగా, అశ్విన్ 2, యాదవ్, శర్మ, జడేజా, రైనాలు ఒక్కో వికెట్ చొప్పున తీశారు. ఇక ఈ లక్ష్యాన్ని భారత్ 36.5 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి పూర్తిచేసింది. జట్టులో శిఖర్ ధావన్ 100, రోహిత్ శర్మ 64 పరుగులు చేసి అవుట్ కాగా, మిగిలిన లాంచానాన్ని కోహ్లీ (44), రహనే (33)లు పూర్తి చేశారు. ఈ విజయంతో క్వార్టర్ లోకి భారత్ ఈజీగా ప్రవేశించింది.ఇక ఇదేసమయంలో ప్రపంచ కేప్ క్రికెట్ చరిత్రలో 9 వరుస విజయాలు సాధించిన అరుదైన ఘనతనూ సొంతం చేసుకుంది. గతంలో 9 వరుస విజయాలతో ఉన్న వెస్టిండీస్ సరసన భారత్ చేరింది. భారత్ 2011 వరల్డ్ కప్ లో చివరి 4 వరుస విజయాలు సాధించగా, ప్రస్తుత పోటీల్లో వరుసగా 5 విజయాలు నమోదుచేసింది. ఇక ధావన్-రోహిత్ లు గతంలో సచిన్-జడేజా పేరిట ఉన్న రికార్డు భాగస్వామ్యాన్ని(1996 ప్రపంచ కప్ లో కెన్యాపై 163పరుగులు) చెరిపేశారు. ఇదే క్రమంలో రోహిత్ వన్డేలో 4000 పరుగులు పూర్తిచేసుకున్న 14వ బ్యాట్స్ మెన్ గా నిలిచాడు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ