ఆయన దృష్టిలో కోహ్లీ ఓ లెజెండ్

February 04, 2015 | 11:08 AM | 41 Views
ప్రింట్ కామెంట్

వన్డే లో సచిన్ పరుగుల ప్రవాహా రికార్డును బద్ధలు కొట్టగల సత్తా ఉన్న ఏకైక బ్యాట్స్ మెన్ గా క్రేజ్ సంపాదించుకున్న వ్యక్తి భారత జట్టు వైస్ కెప్టెన్ విరాట్ కోహ్లీ. అలాంటి కోహ్లీ వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్ లో ఓ లెజెండేనని విండీస్ దిగ్గజం వివిన్ రిచర్డ్స్ అభిప్రాయపడుతున్నాడు. గతంలో కోహ్లీ ఆట తనను గుర్తుచేస్తుందంటూ చెప్పిన రిచర్డ్స్ ఇప్పడు ఏకంగా పది మంది ఆటగాళ్లతో తయారు చేసిన జాబితాలో రిచర్డ్స్ కోహ్లీకి స్థానం కల్పించాడు.‘‘ కోహ్లీ మంచి క్రీడాకారుడు, నేను బాగా ఆస్వాదించే ఆటగాళ్లలో అతను కూడా ఉన్నాడు. యువకుడైన అతన్ని లెజెండ్ ల జాబితాలోకి తీసుకోవటం ఆశ్చర్యపరిచేది. కానీ, నా కళ్లకు మాత్రం అతను ఓ లెజెండ్. అతని ఫామ్ కొనసాగుతుంది.. కొనసాగుతూనే ఉంటుంది’’ అంటూ పొగడ్తల వర్షం కురిపించాడు. ఈ జాబితాలో సచిన్, లారా, గేల్, క్లైవ్ లాయిడ్, రికీ పాటింగ్, మాథ్యూ హెడెన్, వీరేంద్ర సెహ్వగ్, మైకేల్ హస్సీ, ఏబీ డివిలియర్స్, విరాట్ కోహ్లీ తో రిచర్డ్స్ వన్డే టాప్ బ్యాట్సమెన్ జాబితాను తయారుచేశాడు. కెరీర్ లో ఇప్పటిదాకా కేవలం 150 వన్డే మ్యాచ్ లు ఆడిన కోహ్లీ 21 సెంచరీలతో 6, 232 పరుగులు సాధించాడు. అలాంటి కోహ్లీ కి ఈ లెజెండ్ సత్కారం లభించటం నిజంగా అదృష్టమే కదా.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ