కాన్సర్ బారిన పడ్డాక కూడా కోలుకోని, సత్తా చాటి భారత్ కు ప్రపంచకప్ రావటంలో కీలకపాత్ర పోషించాడు యువరాజ్ సింగ్. సూపర్ ఫాంలో ఉన్నప్పటికీ కూడా ఈ దఫా వరల్డ్ కప్ బెర్తుకు మనోడు ఎంపిక కాకపోవటం పట్ల యావత్ క్రికెట్ అభిమానుల్లో నిరాశ నెలకొన్న విషయం తెలిసిందే. అయితే, యువీ ప్రపంచ కప్ ఆశలు ఇంకా సజీవంగా ఉన్నాయన్న ఓ వార్త కాస్త ఊరట కలిగించేదిగా ఉంది. ప్రస్తుతం టీమిండియాలో ఇషాంత్ శర్మ, రోహిత్ శర్మ, భువనేశ్వర్ కుమార్, రవీంద్ర జడేజా గాయాలతో బాధపడుతున్నారు. వీరికి ఈనెల 7న ఫిట్ నెస్ టెస్ట్ ఉంటుంది. ఇందులో ఎవరైనా గనుక విఫలమైతే వారిస్థానంలో యువీని తీసుకునే ఛాన్స్ ఉందని సమాచారం. ప్రస్తుతం యువీ వరుస సెంచరీలతో రంజీల్లో రాణించటం అతనికి అవకాశంపై ఆశలు చిగురింపజేస్తున్నాయి. మరో పక్క ధోనీ కూడా కాస్త ఈ ఎంపికకు సహకరించాల్సి ఉంటుందట.