కప్ లేదు... కనీసం జట్టులో చోటైనా!

March 30, 2015 | 11:12 AM | 128 Views
ప్రింట్ కామెంట్
no_place_for_indian_player_world_cup_team_niharonline

ప్రపంచకప్ సమరం ముగిసిన అనంతరం ఐసీసీ ప్రకటించిన ప్రపంచకప్ 2015 జాబితాలో ఒక్క భారత క్రికెటర్ కు చోటుదక్కలేదు. పోటీల్లో రాణించిన భారత బౌలర్లు ఉమేష్ యాదవ్(18), షమీ(17), అశ్విన్(13) పేర్లు చర్చకు వచ్చినా తుది జట్టులోకి తీసుకోలేదు. ఒక ఐసీసీ డ్రీమ్ జట్టు పగ్గాలు న్యూజిలాండ్ కెప్టెన్ బ్రెండన్ మెకల్లమ్ కు అప్పగించగా, అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన సంగక్కర, వెటోరిలకు స్థానం దక్కింది. ఇక టాప్ స్కోరర్ మార్టిన్ గప్టిల్ తోపాటు స్టీవెన్ స్మిత్, డివిలియర్స్, మాక్స్ వెల్, కోరీ ఆండర్సన్ లకు చోటుదక్కింది. బౌలర్ల జాబితాలో టాపర్ స్టార్క్, బౌల్ట్, మోర్నీ మోర్కెల్ ను ఎంపిక  చేశారు. వరల్డ్ కప్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించిన జింబాబ్వే మాజీ కెప్టెన్ బ్రెండన్ టేలర్ ను 12వ సభ్యుడిగా తీసుకున్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ