చెత్త ప్రదర్శనతో చిత్తుగా ఓడిన పాక్

February 21, 2015 | 11:38 AM | 39 Views
ప్రింట్ కామెంట్
westindies_won_against_pak_in_WC_niharonline

మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్లు దాయాదుల పోరులో ఓటమి చెందిన పాకిస్థాన్ కు మరో ఘోర పరాభవం ఎదురైంది. ప్రపంచకప్ సమరంలో భాగంగా శనివారం వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో చెత్త ప్రదర్శనతో చిత్తుగా ఓడింది. ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 6 వికెట్ల నష్టానికి 310 పరుగులు సాధించింది. ఏ ఒక్క బ్యాట్స్ మెన్ సెంచరీ సాధించకున్నా సమిష్టి క్రుషితో (గేల్ 4 పరుగులు మినహా) భారీ స్కోర్ చేయగలిగింది. ఇక 311 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ ఆదిలోనే తోకముడిచింది. ఆట ప్రారంభించిన కాసేపటికి కేవలం 1 పరుగుకే నాలుగు వికెట్లు కోల్పోయి అక్కడే ఆట మీద పట్టును వదిలేసింది. చచ్చిచెడి చివరాఖరికి 39 ఓవర్లలో 160 పరుగులు చేసి ఆలౌట్ అయింది. విండీస్ బౌలర్లలో అండీ రస్సెల్, జెరోమ్ టేలర్ చెరో మూడు వికెట్లు లాగించారు. అండీ రస్సెల్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. ఈ ఓటమితో పాక్ నాకౌట్ అవకాశాలపై నీలినీడలు కమ్ముకునేలా చేసుకుంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ