సీజన్లో సన్ రైజర్స్ బోణీ

April 14, 2015 | 10:25 AM | 57 Views
ప్రింట్ కామెంట్
David_Warner_niharonline

ప్రస్తుత ఐపీఎల్-8 టోర్నీలో  బలహీనమైన జట్లలో ఒకటిగా పేరున్న హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టు చెలరేగింది. డేవిడ్ వార్నర్ 27 బంతుల్లో 57కు తోడు శిఖర్ ధావన్ 42 బంతుల్లో 50(నాటౌట్), కేఎల్ రాహుల్ 28 బంతుల్లో 44(నాటౌట్) పరుగులతో రాణించటంతో అంతకుముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ జట్టు విధించిన 167 పరుగుల లక్ష్యాన్ని 17.2 ఓవర్లలో అధిగమించి 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. బెంగళూర్ జట్టులో కోహ్లీ 41, డివిలియర్స్ 46 పరుగులు చేసినప్పటికీ భారీ స్కోర్ సాధించటంలో ఆ జట్టు విఫలం అయ్యింది. వార్నర్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. ఇక ఈ విజయంతో హైదరాబాద్ ఐపీఎల్ -8 సీజన్లో బోణీ కొట్టింది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ