ఎట్టకేలకు గ్రాండ్ విక్టరీతో సౌతాఫ్రికా జట్టు సెమీస్ లోకి అడుగుపెట్టింది. ఈసారైనా కప్ కొట్టాలన్న శ్రీలంక ఆశలు గలంతయ్యాయి. గత ప్రపంచకప్ లో రన్నరప్ తో సరిపెట్టకున్న లంకేయులు ఈసారి మాత్రం తడబడింది. జయవర్ధనే, సంగక్కరలకు కప్ తో ఘనంగా వీడ్కొలు పలుకుదామని భావించిన ఆజట్టుకు ఓటమి ఎదురైంది. సఫారీల సంకల్పం ముందు వారి ఆశలు నెరవేరలేదు. ఏకపక్షంగా బుధవారం సిడ్నీలో జరిగిన క్వార్టర్స్ మ్యాచ్లో దక్షిణాఫ్రికా 9 వికెట్ల తేడాతో లంకను చిత్తుగా ఓడించింది. ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న లంక 37.3 ఓవర్లలో 133 పరుగులకు ఆలౌటైంది. ఫామ్ లో ఉన్న సంగక్కర 45, తిరిమర్నే 41 పరుగులు మాత్రమే రాణించారు. ఓ దశలో 30 ఓవర్లకు 109 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయిన లంక టీం మరో నాలుగు ఓవర్లలో 20 పరుగులు చేసి 5 వికెట్లు కోల్పోయింది. డుమ్ని హ్యట్రిక్ తీసి శ్రీలంక నడ్డివిరిచాడు. ఇక స్వల్ఫ లక్ష్యంతో బరిలో దిగిన సఫారీలు 18 ఓవర్లలో వికెట్ నష్టానికి 134 పరుగులు చేసి జయకేతనం ఎగురవేశారు. డి కాక్ 78, డు ప్లెసిస్ 21 పరుగులతో అజేయంగా నిలిచారు. సఫారీ లెగ్ స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ (4 వికెట్లు) కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.