సాహస యాత్రికుడి సలహాలు తీసుకుంటున్న సఫారీ శిబిరం

March 17, 2015 | 12:33 PM | 60 Views
ప్రింట్ కామెంట్
safari_tension_about_srilanka_match_niharonline

ప్రపంచకప్ లో లీగ్ దశ ముగిసింది. రెండు గ్రూప్ ల నుంచి ఎనిమిది జట్లు ఇక కీలకమైన క్వార్టర్స్ లోకి ప్రవేశించాయి. సౌతాఫ్రికా శ్రీలంకతో, భారత్ బంగ్లాదేశ్ తో, ఆస్ట్రేలియా పాకిస్థాన్ తో, న్యూజిలాండ్ వెస్టిండీస్ తో తలపడనున్నాయి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో దక్షిణాఫ్రికా జట్టుకు పాత భయం పట్టుకుంది. ఒత్తిడి సమయాల్లో కీలక మ్యాచ్ లలో కుప్పకూలుతుందన్న పేరును తొలగించుకోవాలని ఎంత క్రుత నిశ్చయంతో ఉన్నా, మ్యాచ్ రోజున ఏం జరుగుతుందోనని సఫారీ శిబిరం తీవ్ర ఆందోళన చెందుతుంది. ఈ నేపథ్యంలో సాహస యాత్రికుడు మైక్ హర్న్ సాయం తీసుకుంటుంది. ఆయన తన అనుభవాలను క్రికెటర్లతో పంచుకుని, వారిలోని భయాన్ని పారదోలతాడని దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు భావిస్తోంది. జట్టు కోచ్ రసెల్ డొమింగో మాట్లాడుతూ... స్టెయిల్, మోర్కెల్ కంటే భయానక పరిస్థితులను హార్న్ ఎదుర్కొన్నాడని, అతని అనుభవం ఎంతో ఉపకరిస్తుందని అన్నాడు. అన్ని అర్హతలున్నా, సఫారీలను మాత్రం వరల్డ్ కప్ ఇప్పటివరకు అందకుండా ఊరిస్తోంది. 1992 లో వరుణుడు అడ్డుతగలగా, 1999, 2007లో దురద్రుష్టం వెంటాడింది. 2011 లో న్యూజిలాండ్ చేతిలో క్వార్టర్ ఫైనల్లో ఓటమిపాలయ్యారు. 434 లాంటి భారీ స్కోర్ అదికూడా ఆస్ట్రేలియా లాంటి డేంజర్ జట్టు మీద ఛేజింగ్ చేసి ప్రపంచరికార్డు నెలకొల్పిన సౌతాఫ్రికా లాంటి జట్టుకు ప్రస్తుతం పట్టుకున్న టెన్షన్ చూస్తూంటే ఆశ్చర్యం కలగక మానదు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ