అక్లాండ్ లో జరుగుతున్న తొలిసెమీస్ లో సఫారీలు వీరబాదుడు బాదారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఆరంభించిన దక్షిణాఫ్రికా బ్యాటింగ్ ఎంచుకుంది. ఆరంభంలో కివీస్ బౌలర్ల దాటికి తడబడినప్పటికీ డు ప్లెసిస్, డివిలియర్స్ భాగస్వామ్యంతో స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. ఇక ఆట 38 ఓవర్ల దగ్గర ఉన్నప్పుడు వర్షం రావటంతో ఆటను నిలిపివేశారు. అప్పటికి సఫారీల స్కోర్ 3 వికెట్ల నష్టానికి 216 పరుగులు సాధించింది. డు ప్లెసిస్ 82, డివిలియర్స్ 60 పరుగులతో క్రీజులో ఉన్నారు. చివరకు వరుణుడు శాంతించటంతో మ్యాచ్ ను 43 ఓవర్లకు కుదించారు. ఇక చివరి 5 ఓవర్లలో సౌతాఫ్రికా పరుగులను దాటిగా పిండుకుంది. 65 పరుగులు రాబట్టుకుంది. దీంతో 5 వికెట్లు కోల్పోయి 281 పరుగుల స్కోర్ ను సాధించింది. దక్షిణాఫ్రికా బ్యాట్స్ మెన్లలో ఆమ్లా(10), డి కాక్ (14), డు ప్లెసిస్(82), రోసో(39), డి మిల్లర్ (49), డి విలియర్స్(65)నాటౌట్, డుమిని(8) నాటౌట్ గా నిలిచారు. అండర్సన్ 3 వికెట్లు తీయగా, బోల్ట్ 2 వికెట్లు పడగొట్టాడు. డక్ వర్త్ లూయిస్ నిబంధనల ప్రకారం న్యూజిలాండ్ టార్గెట్ 43 ఓవర్లలో 298 గా నిర్ణయించారు. అనంతరం బ్యాటింగ్ దిగిన కివీస్ మెక్ కల్లమ్ విరుచుకుపడటంతో 7 ఓవర్లకే 70 పరుగులు సాధించింది. కేవలం 26 బంతుల్లో 59 పరుగులు సాధించి అవుటయ్యాడు. ప్రస్తుతం 10 ఓవర్లకు 80 పరుగులు సాధించి 2 వికెట్లు కోల్పోయింది.