ఆరు వికెట్ల తేడాతో టీమిండియా గెలుపు

March 14, 2015 | 03:33 PM | 63 Views
ప్రింట్ కామెంట్
team_india_niharonline

సిక్సర్లు, ఫోర్లతో క్రికెట్ ప్రియుల కేరింతల మధ్య, ప్రత్యర్థి బౌలర్లను చిత్తు చేస్తూ రైనా, ధోనీల బ్యాటింగ్ తో టీమిండియా ఘన విజయం సాధించింది. ప్రపంచ కప్ గ్రూప్ బీలో భాగంగా జరిగిన మ్యాచ్ లో 8 బంతులు మిగిలుండగానే జింబాబ్వేపై భారత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.104 బంతుల్లో 4 సిక్సర్లు, 9 ఫోర్లు మోదిన  రైనా 110 పరుగులుచేసి నాటౌట్ గా నిలిచాడు. స్లాగ్ ఓవర్లలో జింబాబ్వే బౌలర్లపై విరుచుకుపడ్డ కెప్టెన్ ధోని.. 76 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 85 పరుగులు చేసి ఘన విజయం సాధించింది. ఈ విజయంతో ఆడిన అన్ని లీగ్ మ్యాచ్ ల్లోనూ భారత్ విజయం సాధించినట్లయింది. టీమిండియా ఆదిలోనే ఓపెనర్ల వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. రోహిత్ శర్మ(16), శిఖర్ ధావన్(4), విరాట్ కోహ్లీ( 38), అజ్యింకా రహానే(19) పరుగులు చేసి నిష్ర్కమించారు. అప్పటికి టీమిండియా స్కోరు 92 పరుగులు మాత్రమే. దీంతో టీమిండియా విజయంపై ఒకింత అనుమానం చోటు చేసుకుంది. ఆ తరుణంలో సురేష్ రైనా-మహేంద్ర సింగ్ ధోనీలు ఇన్నింగ్స్ మరమ్మత్తులు చేశారు. వీరిద్దరూ మంచి బంతులను ఆచితూచి ఆడుతూ.. చెత్త బంతులపై విరుచుకుపడ్డారు. ఈ క్రమంలోనే రైనా సెంచరీ చేయగా, ధోనీ హాఫ్ సెంచరీ మార్కును దాటాడు. చివర వరకూ క్రీజ్ లో ఉన్న రైనా-ధోనీలు 196 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పి ఒత్తిడిలో కూడా టీమిండియా తడబడదని నిరూపించారు. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‑ దిగిన జింబాబ్వే 48.3 ఓవర్లలో 287 పరుగులకు ఆలౌటైంది. జింబాబ్వేకు ఆరంభంలో కష్టాలు ఎదురయ్యాయి. భారత బౌలర్ల ధాటికి  జింబాబ్వే 33 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. జట్టు స్కోరు 11 పరుగుల వద్ద జింబాబ్వే ఓపెనర్ మసకద్జ.. భారత పేసర్ ఉమేష్ యాదవ్ బౌలింగ్‑లో అవుటయ్యాడు. ఆ వెంటనే మరో ఓపెనర్ చిబాబా.. షమీ బౌలింగ్‑లో ధావన్‑కు దొరికిపోయాడు. కాసేపటికి మోహిత్ శర్మ ఓవర్లో మిరె అదే బాటపట్టాడు. దీంతో జింబాబ్వే కష్టాల్లోపడింది. 20ఓవర్ల తరువాత భారత బౌలర్లు పట్టుసడలించగా.. జింబాబ్వే బ్యాట్స్‑మెన్ టేలర్, విలియమ్స్ క్రమేణా దూకుడు పెంచారు. టేలర్ కెప్టెన్ ఇన్నింగ్స్‑తో జట్టును ఆదుకున్నాడు. టేలర్.. విలియమ్స్‑తో కలసి నాలుగో వికెట్‑కు 93 పరుగులు, ఎర్విన్‑తో ఐదో వికెట్‑కు 109 పరుగులు జోడించాడు. అశ్విన్.. విలియమ్స్‑ను, మోహిత్.. టేలర్‑ను అవుట్ చేశారు. కాగా జట్టు స్కోరు అప్పటికే 250 మార్క్‑కు చేరువైంది. చివర్లో సికిందర్ రాజా వేగంగా పరుగులు రాబట్టాడు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ