ఓ చిన్న కుక్క పిల్ల జరిగిన గొడవ ఆ పాప ప్రాణం తీసింది. చంపిది ఎవరో పెద్ద వ్యక్తి కూడా కాదు. పొరుగింట్లో ఉండే ఓ 11 ఏళ్ల కుర్రాడు. అది కూడా గన్ తో కాల్చి మరీ చంపాడు. ఈ ఘటన అమెరికాలోని తెన్నెస్సీలో జరిగింది. లతాషా డయ్యర్ అనే మహిళ తన కుమార్తె మెక్ కైలాతో కలసి వైట్ పినీ అనే ప్రాంతంలో నివసిస్తుండేది. ఆ పక్కింట్లోనే ఉండే బాలుడు ఆ బాలికను నిత్యమూ ఏడిపిస్తుంటాడు. కైలా అల్లారు ముద్దుగా ఓ చిన్న కుక్క పిల్లను పెంచుకుంటుండేది. ఆ కుక్క పిల్లను చూస్తానని పక్కింటి బాలుడు అడిగితే కైలా ఒప్పుకోలేదు. దీంతో ఆ పిల్లాడు ఇంట్లోకి వెళ్లి తన తండ్రి గన్ తెచ్చి ఆ పాప గుండెల్లోకి కాల్చాడు. దాంతో అక్కడిక్కడే నేలకొరిగింది.
ఆ పిల్లలిద్దరూ ఒకే స్కూల్లో చదువుతున్నారు. ఎప్పటి నుంచో ఆ బాలుడు నా కూతురిని ఏడిపిస్తున్నాడు. వారి గురించి స్కూల్ ప్రిన్సిపాల్ కు ఫిర్యాదు చేశాను. అప్పుడు కొంతకాలం పాటు ఏడిపించకుండా సైలెంట్ గా ఉన్నాడు. కానీ, ఈ మధ్య తిరిగి వేధించడం మొదలు పెట్టాడని లతాషా వివరించింది. "ఇది ఎంతమాత్రమూ మంచిది కాదు. ఆ బాలుడికి ఇప్పుడిక గుణపాఠం నేర్చుకుంటాడనే అనుకుంటున్నా. నా చిన్నారి కూతురు నాకు కావాలి" అని విలపిస్తూ చెప్పిందామె. ఇక బాలుడిపై ఫస్ట్ డిగ్రీ మర్డర్ కేసు నమోదు చేసినట్లు జెఫర్సన్ కౌంటీ పోలీసు అధికారి బుడ్ మెక్ కోయిగ్ వెల్లడించారు. ప్రస్తుతం న్యాయమూర్తి ఆదేశాలనుసారం ఆ పిల్లాడిని జువైనల్ సెంటర్ తరలించారు.