ప్రేయసి దెబ్బకు గుండెతోపాటు అన్నీ ముక్కలు చేసుకున్నాడు

June 20, 2015 | 12:27 PM | 4 Views
ప్రింట్ కామెంట్
german_man_cut_all_things_half_for_his_love_breaking_niharonline

ప్రేయసి హ్యాండ్ ఇచ్చింది, దాంతో ‘‘నా గుండె పగిలింది. రెండు ముక్కలయింది అని పాటతో సరిపెట్టుకోలేదా బాయ్ ఫ్రెండ్. విన్నూత రీతిలో తన మాజీ ప్రేయసిపై కోపాన్ని తీర్చుకున్నాడు. లారా అనే తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ పై అక్కసుతో జర్మనీకి చెందిన ఓ యువకుడు ప్రేమలో ఉన్నప్పుడు తాము వాడిన వస్తువులను సగం చేసి పాడేశాడు. తన ప్రేయసి జ్నాపకాలేవి తనతో ఉండకూడదని నిర్ణయించుకున్న ఆ భగ్న ప్రేమికుడు ఈ పనికి పాల్పడ్డాడు. నా గుండె ఒక్కటే కాదు... నా సర్వం విరిగిపోయాయి అన్న సందేశాన్ని మాజీ లవర్ కి  చెప్పాలనుకున్నాడన్నది వాటిని చూస్తే అర్థమైపోతోంది. ప్రయాణించిన కారు, కూర్చున్న కుర్చీ, హెల్మెట్, లాప్ ట్యాప్, చివరికి తన ప్రేయసికి ఇష్టమైన టెడ్డీబేర్ ను ఇలా దేన్ని ఇతగాడు వదలలేదు. టీవీ, సీడీలు, లాప్‑టాప్, సెల్‑ఫోన్, ఐఫోన్, సైకిల్, హెల్మెట్, సోఫా, బెడ్, ఇలా అవన్నీ ఆ ప్రేమికుడి ప్రకోపానికి బలయ్యాయి. అంతటితో ఆగక కోసిన వాటన్నింటినీ మాజీ ప్రేయసికి పార్సిల్ పంపించాడు. ఇంకో విషయమేంటంటే... ఈ నిర్వాకాన్ని మొత్తం వీడియో తీసీ యూట్యూబ్ లో అప్ లోడ్ చేశాడు. ఇక ఈ వీడియోకు జనాల దగ్గర నుంచి క్రేజ్ రావటంతో దానిని కూడా క్యాష్ చేసుకోవాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా తన వద్ద ఉన్న మిగిలిన సగభాగాలను ఆన్ లైన్ లో అమ్మకం చేసి సొమ్ము చేసుకున్నాడు. ప్రేయసి పోతే పోయింది కానీ, భలే గిరాకీ తగిలిందని హ్యాపీ గా ఫీలవుతున్నాడా వీర ప్రేమికుడు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ