ముస్లింల బతుకు భారత్ లోనే బెటరంటున్న ఉగ్రవాది

February 24, 2016 | 12:47 PM | 1 Views
ప్రింట్ కామెంట్
indian-muslims-life-better-than-islam-states-niharonline

ఇస్లామిక్ రాజ్య స్థాపనే లక్ష్యమంటూ ప్రపంచ దేశాలపై దాడులకు బరి తెగిస్తున్న ఉగ్రవాదులకు సొంత దేశాల్లోనే చీత్కారాలు ఎదురవుతున్నాయి. అమాయక జనాలను బలి తీసుకోవటంతోపాటు ఇస్లాంకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని అక్కడి జనాలు ఛీ కొడుతున్నారు. అయితే మత అసహనం అంటూ అమీర్ ఖాన్ లాంటి నటుడు దేశం పై అసంతృప్తి వ్యక్తం చేసిన వేళ, ఓ కరడు గట్టిన ఉగ్రవాది చేసిన వ్యాఖ్యలు ఆసక్తి కలిగిస్తున్నాయి. ప్రపంచ దేశాల్లో ఉన్న ముస్లింల పరిస్థితి కంటే ఓ హిందూ దేశమైన భారత్ లో ఉన్న ముస్లింల స్థితిగతులు బాగా మెరుగ్గా ఉన్నాయని అతను చెబుతున్నాడు.

దశాబ్దం క్రితం భారత్ లో దాడులు చేసేందుకు వచ్చిన అబ్దుల్ అజీజ్ అలియాస్ గిద్దా చెబుతున్న విషయాలివీ. నిజానికి దాడులు చేద్దామని వచ్చిన అతను ఇక్కడి ముస్లింల స్థితిగతులను పరిశీలించి, ఆపై మనసును కూడా మార్చుకున్నాడంట. అయితే లష్కరే తోయిబా తిరిగి అతన్ని కరుడుగట్టిన ఉగ్రవాదిగా మార్చేసింది. చివరికి సౌదీలో చమురు బావులను పేల్చేసిన కేసులో అక్కడి పోలీసులకు చిక్కిన అజీజ్ ను అక్కడి పోలీసలు భారత్ కు తరలించారు. విచారణలో ఈ జిహాదీ ఈ విషయాలన్నీ చెప్పుకొచ్చాడు. ఉగ్రవాదంలో చేరాకగానీ, చనిపోయాక గానీ వారి కుటుంబ సభ్యులకు అండగా నిలుస్తామని చెబుతున్న ఆయా ఉగ్రసంస్థలు అస్సలు పట్టించుకోనే పట్టించుకోవని చెబుతున్నాడు. అయితే భారత్ లాంటి దేశంలో ఉగ్రవాద కుటుంబాలకు ప్రభుత్వం ఉపాధి కల్పించటం, చేయూతనివ్వటం తనకు ఎంతగానో ఆశ్చర్యం కలిగించిందని చెబుతున్నాడు. అమీర్ ఖాన్ కన్నా ఎక్కువే గమనించి ఉంటాడీ మనసు మారిన ఉగ్రరాక్షసుడు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ