ఇంటర్నెట్ ప్రపంచంలో సోషల్ మీడియా పలువురు అమాయకుల ప్రాణాలను బలితీసుకోవడంతో పాటు అనేక మందిని దోషులుగా కూడా మార్చింది. అలాంటి ఉదంతమే ఇక్కడో ఒకటి చోటుచేసుకుంది. లండన్ లో ఓ హెయిర్ డ్రెస్సర్ జీవితాన్ని ఫేస్ బుక్ ఏకంగా మార్చేసింది. ఎంతలా అంటే తన బోయ్‌ఫ్రెండ్ ను అమె ఏకంగా హత్య చేసేదాకా. అయితే ఇక్కడో ఒక్క చిన్న ట్విస్ట్ ఉంది. వాడింది ఆమె కాదు. ఆమె బాయ్ ఫ్రెండ్.
పూర్తి వివరాలిలోకి వెళ్లితే... టెర్రీ మారీ పామర్ అనే యువతి హెయిర్ డ్రెస్సర్ గా పనిచేస్తుండేది. ఆమెకు డామన్ సియర్సన్ అనే బోయ్ ఫ్రెండ్ ఉన్నాడు. నిరుద్యోగి అయిన అతనికి ఆమె ఓ మొబైల్ ఫోన్ కొనిచ్చింది. అందులో ఫేస్‌బుక్ చాటింగ్ చేయడం మొదలెట్టాడు. తన అర్ధనగ్న ఫొటోలు కూడా విపరీతంగా పోస్ట్ చేసేవాడు. అలా.. అతడి వాడకం శృతిమించింది. దాంతో బాగా విసిగిప ఓయిన పామర్ ఓ నిర్ణయానికి వచ్చింది. పట్టరాని కోపంతో సియర్సన్‌ను గుండెల్లో కత్తితో పలు పోట్లు పొడిచి హత్యచేసింది. ఆ వెంటనే షాక్ నుంచి తేరుకుని స్వయంగా తానే అత్యవసర సేవల నంబర్ 999కు కాల్ చేసింది. తన లవర్ పొరపాటున కత్తితో పొడుచుకుని గాయపడ్డాడని చెప్పినట్లు పోలీసులు తెలిపారు.
ఆరు నెలల విచారణ తర్వాత పోలీసుల దర్యాప్తులో నిజాలు ఒక్కక్కటిగా బయటపడ్డాయి. బోయ్ ఫ్రెండ్ లేకపోవడంతో తనకు చాలా బోరింగ్‌గా ఉందని ఫేస్ బుక్ లో ఓ సందేశాన్ని పంపిన ఆమె, ఆ తర్వాత సియర్సన్ వ్యవహారం నచ్చకనే అతడ్ని చంపేశానంటూ మరో పోస్ట్ లో పేర్కొంది. తనను వదిలించుకోవాలని ప్రయత్నించాడని, వేరొక యువతిలో సన్నిహితంగా ఉంటున్నాడని భావించి ప్రియుడ్ని హత్యచేసినట్లుగా పామర్ కోర్టులో చెప్పిందట. మొత్తానికి ఫేస్ బుక్ ఆ ఇద్దరి ఫేట్ ను మార్చేసింది.