అందమైన సమద్ర తీరం. చుట్టు పచ్చని చెట్లు, వెన్నెల్లో బంగారంలా మెరిసే ఇసుకతిన్నెలు... వెరసి ఇది ఆ గ్రామ స్వరూపం. కానీ, మరో పదేళ్లలో ఆ గ్రామం నామా రూపాలు లేకుండా పోతుందట. అమెరికా అలాస్కాలోని కివలిన గ్రామం పరిస్థితి ఇది. సముద్ర మట్టానికి 400 మీటర్ల ఎత్తునున్న ఈ గ్రామాన్ని అభివృద్ధి మాటున ముంచేశారు. ఒకప్పుడు అందాలతో పర్యాటకులను ఆకర్షిస్తూ అలస్కాకే అత్యధిక ఆదాయం తెచ్చిపెట్టిన పర్యటన ప్రాంతం ఇప్పుడు వినాశనాన్ని చవిచూస్తుంది. పరిశ్రమల నుంచి విడుదల చేసే గ్రీన్ హౌస్ వాయువుల వల్ల వాతావరణంలో హఠాత్ పరిణామాలు సంభవించాయి. హిమానీ నదాలు కరిగిపోతున్నాయి. క్రమంగా 2025 నాటికి ఇది సముద్ర గర్భంలో కలిసిపోబోతుంది.
ఆర్మీ ఇంజనీర్ల హెచ్చరికలతో ప్రభుత్వం ఆ గ్రామానికి నిధుల కేటాయింపు నిలిపివేసింది. 2011 లో సముద్ర ఆటుపోట్లను తట్టుకునేందుకు ఓ గోడను నిర్మిస్తే అది కాస్తా కోట్టుకుపోయింది. ఇక తిండి దొరక్క అక్కడి ప్రజలు మొన్నటిదాకా పండ్లపై, తిమింగలాలపై ఆధారపడి బతికారు. కానీ, ఇప్పడు అవీ కూడా దొరక్కపోవటంతో సీల్ లను చంపి తింటున్నారట. ఈ నెలలో భూతాపంపై అలస్కాలో ఓ సదస్సు జరగనుంది. దీనికి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వెళ్లనున్నారు. తమ గ్రామాన్ని గోడును చెప్పేందుకు ఆ గ్రామ ప్రజలు ఒబామాను కలిసే ప్రయత్నాలు చేస్తున్నారంట.