న్యూడ్ ఫోటోల కేసు సంగతి అంతేనా?

September 01, 2015 | 12:57 PM | 1 Views
ప్రింట్ కామెంట్
nude stars cyber attack still unsolved by FBI.jpg

హాలీవుడ్ లో ఏడాది క్రితం ఓ కేసు సంచలనం సృష్టించింది. మొత్తం హాలీవుడ్ హీరోయిన్ల నగ్నచిత్రాల ఇంటర్నెట్ లో దర్శనమిచ్చాయి. ఆపిల్ ఐ క్లౌడ్ ఖాతాలను హ్యాకర్లు హ్యాక్ చేసి ప్రముఖ హాలీవుడ్ హీరోయిన్లతోపాటు సెలబ్రిటీల నగ్నచిత్రాలను పలు వెబ్ సైట్ లలో పోస్ట్ చేశారు. ఈతతంగం అంతా ఆగష్టు 31, 2014 లో జరిగింది. ఇక ఈ అంశాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని అమెరికా ప్రభుత్వం ఎఫ్ బీ ఐ కి కేసును అప్పజెప్పింది. ఈ ఏడాది కాలంలో ఎంతో మందిని విచారించినప్పటికీ అసలు సూత్రధారులను మాత్రం ఇప్పటికీ పట్టుకోలేకపోయింది. ఆఖరికి నిన్నటికి ఏడాది పూర్తి కావస్తున్నప్పటికీ దీనిపై ఎఫ్ బీ ఐ ని కదిలిస్తే తామింకా ఆ కేసును విచారిస్తున్నామని చెప్పుకొచ్చింది.  మరో వైపు ఈ విషయమై ఆపిల్ కంపెనీ మాత్రం తమ తప్పేంలేదని చేతులెత్తేసింది. చాలా స్ర్టాంగ్ సర్వర్లను నిర్వహిస్తున్నామని, ఖాతాదారుల బలహీనమైన పాస్వర్డ్ ల వల్లే ఈ సమాచారం లీక్ అయ్యిందని చెబుతోంది.

ఈ ఘటన తర్వాత ఆఫిల్ ఐ క్లౌడ్ రెండంచెల భద్రతా వ్యవస్థను నిర్వహిస్తోంది. అయినప్పటికీ తాజాగా కెనడాకు చెందిన అడల్డ్ డేటింగ్ వెబ్ సైట్ ఆస్లీ మాడిషన్ తోపాటు సోని పిక్చర్స్ సైట్లను హ్యాక్ చేసిన హ్యాకర్లు ఎంతోమంది పడకగది ఫోటోలను, వీడియోలను లీక్ చేశారు. దీంతో పాస్వర్డ్ ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని ఆపిల్ కంపెనీ హెచ్చరికలు జారీ చేస్తోంది. అలాగే ప్రతి ఒక్కరు వాడే ఎలక్ర్టానిక్ పరికరాలు కూడా నాణ్యమైనవి వాడాలని సూచిస్తోంది. అంతేకాదు సులువుగా గుర్తించేలా ఉన్న (పుట్టిన రోజులు లేదా ఫోన్ నెంబర్లను) పాస్వర్డ్ లుగా ఇవ్వకూడదని ఆ సంస్థ హెచ్చరిస్తోంది. ఎఫ్ బీ ఐ చేతికి కూడా చిక్కకుండా ఓ కేసు ఏడాదిపాటు సా... గుతుదంటే హ్యాకర్లు ఏ రేంజ్ టెక్నాలజీని వాడుతున్నారో అర్థం చేసుకోవాలి.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ