బొత్తిగా అందం లోపించిన అమ్మాయిలను సైతం మేకప్ అనే మహాత్యం ద్వారా ఆకర్షనీయంగా తీర్చిదిద్దడం ఈ రోజుల్లో కామన్ అయిపోయింది. అసలు స్త్రీలు తమ ముఖారవిందానికి మరింత మెరుగులు దిద్దుకోవడం ఇప్పటిదేంకాదు. యుగయుగాలుగా వస్తున్నదే. అయితే కాలానుగుణంగా అతివల మేకప్ రీతుల్లో ఎన్నో మార్పులు కూడా వచ్చాయి. మేకప్ ఉన్నప్పుడు ఒకలా... తీసేస్తే మరోలా కనిపించే అతివలు కూడా ఎందరో. అల్జీరియాలో కూడా ఈ రకంగానే మోసపోయి కోర్టు మెట్లు ఎక్కాడు. భార్యను చూసి దొంగనుకుని బెంబేలెత్తిపోయాడు. పెళ్లికి ముందు ఆమెను చూసి (మేకప్ లో) ఎంతో ముచ్చటపడ్డాడు. మేకప్ లో జిగేల్మంటూ కనిపించడంతో కాబోయే భార్య అందగత్తేనని తీర్మానించుకున్నాడు. పెళ్లిలోనూ ఫుల్ మేకప్ తో అమ్మడు బాగానే మేనేజ్ చేసింది.
అయితే, పెళ్లి అనంతరం కొత్త కాపురం మొదలుపెట్టేందుకు నూతన నివాసానికి వెళ్లగా, ఆ మరుసటి రోజే అమ్మడి మేకప్ గుట్టు రట్టయ్యింది. మరుసటి రోజు ఉదయం నిద్రచేసి చూసిన అతగాడు పక్కన ఎవరో కొత్త స్త్రీ ఉన్నట్లు గమనించి ‘దొంగ దొంగ’ అని కేకలు పెట్టాడు. తేరుకున్నాక... ఆమె అతని భార్యే అని తెలుసుకుని ఆశ్చర్య పోయాడు. మేకప్ తీసేసరికి ఒరిజినల్ గెటప్ బయటపడిందని తెలుసుకుని లబోదిమోమన్నాడు. అనంతరం తనను మోసం చేశారంటూ కోర్టుకెక్కాడు.