ఉగ్రవాది టైగర్, త్రికోణ ప్రేమాయణం

August 03, 2015 | 04:07 PM | 3 Views
ప్రింట్ కామెంట్
tiger_memon_love_story_niharonline

మొన్న ఉరి తీయించుకున్న యాకుబ్, అన్న టైగర్ మెమన్ చీకటి జీవితంలో ఓ చిన్న జిగేల్! ఈయన ఓ పెద్ద విటశేఖరుడని దానికోసం వేటకై పలు వేశ్యావాటికల పర్యటన చేపట్టేవాడని ప్రముఖ ఉత్తరాది దిన పత్రిక వెల్లడిచేసింది. అట్టితరుణంలో ఓ బాలామణి ప్రేమలో గాఢాతి గాఢంగా కూరుకుపోయి తన పొట్టకూటికై చేసే స్మగ్లింగ్ అనే పరిశుద్ధ్య కార్యక్రమాన్ని త్యజించేందుకు సిద్ధపడ్డాడని తెలిసింది. ఇదే మాదిరి కిషన్ అనే అర్భకుడు అదే సుందరిని ప్రేమించినవాడయి, తనకంటే శత్రు ప్రేమికుడు బాహుబలి అని గ్రహించుకున్న జ్నానము వలన తనను తాను ఆత్మార్పణం కావించుకోబోయాడు. తత్ఫలితంగా సదరు అభిసారిక కిషన్ ప్రేమకు దాసోహమని టైగర్ ప్రేమేంటి, జంతుప్రేమ... ఛీపాడు అనే చీదరించుకుంది. రాజమౌళి నాన్నగారికి ఈ కథాకమామిషు తెలిస్తే మంచి కథ ఒకటి నేసి, పేని, అల్లి వారసుడికి అందిస్తాడు. పైన తెలుసుకున్న కథలో మసాలా సరిపోకపోతే దీన్లో హీరోయిన్ పేరున గల కారులో బాంబులు దండిగా పడి ఉన్న విషయం పోలీసులు గమనించి ఆ బాటలో దర్యాప్తు కొనసాగించిన వైనం ఫ్లాష్ బ్యాక్ గా వాడుకోవచ్చు. శుభం!

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ