అంగారకుడిపై శవపేటిక...!

December 29, 2014 | 04:45 PM | 40 Views
ప్రింట్ కామెంట్

అప్పట్లో ఫ్లయింగ్ సాసర్లకు సంబంధించి ఎన్నో వార్తలు వచ్చేవి. అన్ ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్ (యూఎఫ్ఓ) లని వాటికి నామకరణం కూడా చేశారు. తాము వాటిని చూశామని కొందరు చెప్పేవారు కూడా. కానీ, ఖచ్చితమైన ఆధారాలు మాత్రం ఇంత వరకు లభ్యం కాలేదు. ఔత్సాహికులు మాత్రం వాటి కోసం, ఏలియన్ల కోసం అన్వేషించటం మానలేదు. తాజాగా, యూట్యూబ్ లో పోస్టయిన ఓ వీడియోలో అంగారకుడిపై ఓ శవపేటిక వంటి ఆ కృతి దర్శనమివ్వడం ఆసక్తి రేకెత్తిస్తోంది. దగ్గరి నుంచి చూస్తే తప్ప అందులోని శవపేటిక వంటి శిల కనిపించటం లేదని ‘ఇంక్విజిట్టర్’ వెబ్ సైట్ పేర్కొంది. ఈ రాతి ఆకారం ఓ శవపేటికలా కనిపిస్తోందని యూఎఫ్ఓలపై పరిశోధనలు చేస్తున్న స్కాట్ వారింగ్ తెలిపారు. నాసా తన క్యూరియాసిటీ రోవర్ ను ఈ రాతి వైపు మళ్లీస్తే మరిన్ని ఆసక్తికర సమచారం వెల్లడయ్యే అవకాశం ఉందని ఆయన తెలిపారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ