ఎయిర్ ఏషియా శకలాల గుర్తింపు?

December 29, 2014 | 04:09 PM | 24 Views
ప్రింట్ కామెంట్

ఎయిర్ ఏషియా విమానం కోసం జావా సముద్రంలో చేస్తున్న గాలింపు చర్యల్లో భాగంగా కొన్ని శకలాలను గుర్తించినట్లు ఇండోనేషియా అధికారి ఒకరు తెలిపారు. నంగ్కా దీవికి 100 కిలోమీటర్ల దూరంలో సముద్రంలో కొన్ని అనుమానిత శకలాలను ఆస్ట్రేలియా ఓరియన్ ఎయిర్ క్రాఫ్ట్ కనుగొన్నట్లు సమాచారం ఇచ్చామని జకార్తాకు చెందిన ఎయిర్ ఫోర్స్ బేస్ కమాండర్ రియర్ మార్షల్ ద్వి పుత్రానొ చెప్పారు. కాగా, ఈ శకలాలు అ దృశ్యమైన ఎయిర్ ఏషియా విమానానికి చెందినవా?కావా? అని చెప్పలేమన్నారు. ప్రస్తుతం ఇంకా సముద్రంలో గాలింపు కొనసాగుతూనే ఉంది. ఇందులో 162 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. కాగా, ఇదే ఏడాది మార్చి 8న 239 మంది ప్రయాణికులతో కౌలంలపూర్ నుంచి బీజింగ్ బయలుదేరిన మలేషియా విమానం ఇదే తరహాలో కనిపించకుండా పోయిన విషయం తెలిసిందే.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ