అమెజాన్ లో ఇక ఆ ఆటలు చెల్లవు

February 09, 2016 | 11:02 AM | 4 Views
ప్రింట్ కామెంట్
amazon-india-no-refund-mobile-purchases-niharonline

ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్న డిజిటల్ విధానం కొత్తపుంతలు తొక్కుతున్న నేపథ్యంలో ఈ కామర్స్ వ్యాపారాలు మరింత ఎత్తుకు చేరుతున్నాయి. అందుకు తగ్గట్లుగానే రోజుకో కొత్త నిబంధనలు అమలులోకి వస్తున్నాయి. అందులో భాగంగా తమ కస్టమర్లకు షాక్ ఇచ్చేందుకు ప్రముఖ ఆన్ లైన్ షాపింగ్ దిగ్గజం అమెజాన్.కామ్ సిద్ధమైపోయింది. వస్తువు రిటర్న్ చేసే విధానానికి స్వస్తి చెప్పబోతుంది.

                                గతంలో ఏదైనా వస్తువును అమెజాన్ లో కొనుగోలు చేసిన అనంతరం అది వినియోదారుడ్ని సంతృప్తిపరచకపోతే, రిటర్న్ చేస్తే సదరు సంస్థ డబ్బు వాపస్ చేసేది. ఈ కారణంగానే అమెజాన్ తక్కువ వ్యవధిలో వినియోగదారుల ఆదరణ చూరగొంది. ఇక ఇప్పుడు అమెజాన్ రిటర్న్ పాలసీలో భారీ మార్పులు చేసింది. కొనుగోలు చేసిన వస్తువుకు సంబంధించిన పూర్తి సమాచారం వేరే పేజ్ లో ఉంటుందని, దానిని చూసుకున్న తరువాతే కొనుగోలు చేయాలని సూచిస్తోంది. డెలివరీ అయిన వస్తువు డామేజ్ అయిన పక్షంలో కానీ, లేక కొనుగోలు చేసిన వస్తువు స్థానంలో వేరే వస్తువు డెలివరీ అయిన పక్షంలో కానీ ఈ రిటర్న్ పాలసీ వర్తిస్తుందని స్పష్టం చేసింది.

మిగతా విషయాలలో వస్తువును రిటర్న్ చేసే అవకాశం లేదని అమెజాన్ వెల్లడించింది. ఈ నిబంధన ఫిబ్రవరి 7 నుంచి అమలులోకి వస్తుందని ఓ ప్రకటనలో పేర్కొంది. ముందుగా కేవలం మొబైల్ ఫోన్లకు మాత్రమే ప్రవేశపెట్టి ఆపై మిగతా వాటికి కూడా ఈ నిబంధనను వర్తింపు చేయాలని ఆ సంస్థ భావిస్తోంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ