పదేళ్ల బాలుడితో దారుణం చేయించారు

February 05, 2016 | 11:58 AM | 2 Views
ప్రింట్ కామెంట్
10years-kid-junior-jihadi-killing-man-niharonline

ఇస్లామిక్ రాజ్య స్థాపనే లక్ష్యంగా రంగంలోకి దిగిన ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) దారుణాలకు అంతే లేకుండా పోతోంది. తమకు ఎదురుతిరిగిన వారితోపాటు, అమాయకులను అత్యంత దారుణంగా హత్య చేస్తూ వస్తున్న ఆ ఉగ్రవాద సంస్థ తాజాగా మరో ఘాతుకానికి తెగబడింది. ఏది తప్పో, ఏది ఒప్పో తెలియని పిల్లల చేత హత్యలు చేయిస్తూ ప్రపంచాన్ని నివ్వెరపరుస్తోంది. జిహాదీ జూనియర్ గా అతనికి నామకరణం చేసి దారుణ హత్యకు పురిగొల్పారా రాక్షసులు.

17 నిమిషాల నిడివి ఉన్న తాజా వీడియోలో ఆంగ్లం అనర్గళంగా మాట్లాడుతున్న పదేళ్ల బాలుడు, ఐఎస్ బందీగా పట్టుకున్న ఓ వ్యక్తిని అటవీ ప్రాంతం ఈడ్చుకుని వచ్చి కెమెరా ముందు మోకాళ్లపై కూర్చోబెట్టి, ఆ వెనువెంటనే అతడి కుత్తుకను పెద్ద కత్తితో తెగ్గోశాడు. ఆ బాలుడిని అమెరికా దాడుల్లో చనిపోయిన ఐఎస్ ఫైటర్ అబూ దర్దా కుమారుడిగా భావిస్తున్నారు. బందీ గొంతును అవలీలగా కోసేసిన సదరు బాలుడు అమెరికాకు తీవ్ర స్థాయిలో హెచ్చరికలు జారీ చేశాడు. ఇక ఈ వీడియోపై మానవ హక్కుల సంఘాలు విరుచుకుపడ్డాయి. ముక్కుపచ్చలారని చిన్న పిల్లలను ప్రభావితం చేయించి హత్యలు చేయించడం దారుణమని పేర్కొన్నాయి.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ