గేమ్స్ ఆడే అమ్మాయిలు జర జాగ్రత్త

September 26, 2015 | 12:41 PM | 3 Views
ప్రింట్ కామెంట్
An-Hour-Video-Game-Make-Girls-Fat-niharonline

కంప్యూటర్ ముందు కూర్చోని గేమ్స్ ఆడే అమ్మాయిలు ఇది చదవండి. గంటల తరబడి కంప్యూటర్ ముందు పనిచెయ్యటం ఓ ఎత్తయితే వాటి ముందు కూర్చొని తీరిగ్గా గేమ్స్ ఆడటం మరో ఎత్తు. ఇది మీ శరీరంపై తీవ్ర చూపుతుందని ప్రయోగాలు తెలుపుతున్నాయి.

ఎక్కువ సేవు కంప్యూటర్ గేమ్స్ ఆడితే అమ్మాయిలు బరువు పెరుగుతారని ఓ పరిశోధన తెలుపుతోంది. తాజా పరిశోధనల్లో ఈ ఆసక్తికర అంశం వెలుగు చూసింది. ప్రతిరోజు కనీసం గంటపాటు కంప్యూటర్ గేమ్స్ ఆడే అమ్మాయిలు, అసలు ఈ గేమ్స్ ఆడని అమ్మాయిల కంటే బరువు ఎక్కువగా ఉంటారని పరిశోధకులు వెల్లడించారు. సుమారు 20 నుంచి 24 ఏళ్లలోపు ఉన్న 2500 మంది అమ్మాయిలపై పరిశోధనలు నిర్వహించామని వారు చెప్పారు.

మెయిలింగ్, ఛాటింగ్, గేమ్స్ వీటిపై గడిపే సమయం వారి బాడీ మాస్ ఇండెక్స్ పై ప్రభావం చూపుతుందని వారు వివరించారు. ముఖ్యంగా గేమ్స్ ఆడే వారు మాములు కన్నా  4 కేజీల బరువు పెరుగుతారని, దీనిపై ఐదేళ్లపాటు అధ్యయనం జరిపిన పరిశోధకులు తేల్చి చెప్పారు. అయితే మగవాళ్లు దీని నుంచి మినహాయింపని వారంటున్నారు. మగవారిలో ఎలాంటి మార్పులు తాము గమనించలేదని వారు స్పష్టం చేశారు. సో గర్ల్స్ బీకేర్ ఫుల్.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ