88 ఏళ్ల రికార్డు బ్రేక్ అయ్యింది

September 25, 2015 | 11:05 AM | 5 Views
ప్రింట్ కామెంట్
record-temparatures-in-88-years-niharonline

88 ఏళ్ల రికార్డు బద్ధలైంది. తెలుగు రాష్ట్రాల వాతావరణంలో ఎన్నడూ చూడనటువంటి మార్పు. సెప్టెంబర్ నెలలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాధారణంగా సెప్టెంబరులో ఎండ వేడిమి సగటున 31 నుంచి 33 డిగ్రీలుగా ఉంటుంది. 1927లో మాత్రం 36.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.  మధ్యాహ్నం హైదరాబాద్, రామగుండం, రెంటచింతల సహా పలు ప్రాంతాల్లో 88 ఏళ్ల నాటి రికార్డు బద్దలైంది. హైదరాబాదులో 36.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని వాతావరణ శాఖ డైరెక్టర్ వైకే రెడ్డి వివరించారు. గాలిలో తేమ 60 శాతం మేరకు ఉండటంతో ఉక్కపోత అధికంగా ఉందని వివరించారు. కాగా,  సాయంత్రం పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. పగటి పూట ఉష్ణోగ్రతలు మండిస్తూనే ఉన్నాయి.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ