ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద (ఐఎస్ ఐఎస్) ప్రేరేపిత ఇండోనేషియా పైలట్లు విధుల్లో ఉన్నట్లు ఆపరేషన్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ పేరిట ఆస్ట్రేలియా విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. వీరు ఇండోనేషియాకు చెందిన వారని, ఎయిర్ ఆసియాతోపాటు ప్రీమీ ఎయిర్ విమానయాన కంపెనీలో పనిచేస్తున్నారని అనుమానిస్తున్నట్లు తెలిపింది. వీరు ప్రమాదకారకులు కావచ్చని ఆస్ట్రేలియన్ ఫెడరల్ పోలీసు వర్గాలు తెలిపాయి. ఈ విషయంలో వారిని గుర్తించేందుకు విమానయాన సంస్థల సహకారాన్ని ఫెడరల్ పోలీసులు కోరారు. ఇది నిఘా, భద్రతలకు సంబంధించిన అంశాలు కాబట్టి ఏ విధమైన ఇతర వివరాలు అందించలేమని పోలీసు వర్గాలు వివరించాయి. కాగా, ఎయిర్ ఏషియా సంస్థ ఇండియాలో లోకాస్ట్ ఎయిర్ లైన్స్ గా పేరు తెచ్చుకున పలు నగరాల మధ్య విమానయాన సేవలు అందిస్తున్న సంగతి తెలిసిందే.