జాబ్ ల కోసం యువతులకు ఇలాంటి పరీక్షా?

July 06, 2015 | 11:50 AM | 6 Views
ప్రింట్ కామెంట్
gilr_kissing_crocodile_china_interview_niharonline

తమకున్న విద్యార్హలతోపాటు కొత్త కొత్త ఐడియాలతో కంపెనీ అభివృద్ధికి పాట్పడే శక్తి ఉంటే చాలు ఉద్యోగం దానంతట అదే తన్నుకొస్తుంది. అయితే చైనాలోని ఓ కంపెనీ వీటితోపాటు అదనంగా ‘ధైర్యం’ కూడా ఉండాలనే షరతు పెట్టిందట. అదీ యువతుల విషయంలోనే కావటం విశేషం. ఇటీవల గ్యాంగ్ డాంగ్ అనే కంపెనీ సేల్స్ ఉమెన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. కంపెనీ పెద్దది కావటంతో యువతులంతా ఇంటర్వ్యూకి క్యూ కట్టారు. తేలివితేటలకు సంబంధించిన మొదటి రౌండ్ దాటి రెండో దానికి వెళ్లిన వారికి అక్కడ అనుకోని షాక్ ఎదురైంది. ఏంటా టెస్ట్ అనుకుంటున్నారా? బతికున్న మొసలికి లిప్ లాక్ ఇవ్వాలట. మొసలి మాంసం, చర్మాలతో తయారుచేసిన ఆరోగ్య ఉత్పత్తులను విక్రయించే సదరు కంపెనీ లో చేరాలంటే మొసలితో భయం లేకుండా ప్రవర్తించాలన్నదే వారి ఉద్దేశమట. ఎంత మూతి కట్టేసి ఉన్నంత మాత్రానా మరీ మొసలిని ముద్దాడడమా?. చాలా మంది భయపడి డ్రాప్ అయిపోగా, కొంతమంది ధైర్యం చేసి మొసలికి ముద్దుపెట్టారట. ఇలా మొసలిని ముద్దాడిన యువతులకు 1000 రూపాయల ప్రైజ్ మనీతోపాటు తర్వాతి రౌండ్ కు కూడా ఎంపిక చేశారట.   

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ