వేలెడంత లేదు విమానాన్ని ఆపేసింది

January 06, 2016 | 05:35 PM | 1 Views
ప్రింట్ కామెంట్
bee-troubles-garuda-airlines-flight-niharonline

ఓ చిన్ని తేనెటీగ ఒక పెద్ద విమానాన్ని ఆపేసింది. ఆ దెబ్బకు ప్రయాణికులు ఇబ్బందిపడటంతోపాటు, సదరు ఎయిర్ లైన్స్ సంస్థ ప్రయాణికులకు నష్టపరిహారం చెల్లించాల్సి వచ్చింది. ఇంతకీ ఇది ఎక్కడా? ఏమిటి? అనుకుంటున్నారా. ఇండోనేషియాలోని గరుడ ఎయిర్ లైన్స్ కు చెందిన బోయింగ్ 737 విమానం సుమత్రా దీవుల నుంచి జకార్తా వెళ్లాల్సి ఉంది. దీంతో ప్రయాణికులంతా విమానం ఎక్కిన అనంతరం పైలట్ విమానం స్టార్ట్ చేశాడు. స్టార్ట్ చేయగానే ముందుకు కదలాల్సిన విమానం మెరాయించింది. స్టార్ట్ కాలేదు. దీంతో వెంటనే పైలట్ ఇంజిన్ లో సమస్య ఉందని, స్టార్ట్ చేయగానే విమానం కదల్లేదని అధికారులకు సమాచారం అందించాడు.

                    రంగ ప్రవేశం చేసిన అధికారులు ఇంజిన్ లోని ఓ ట్యూబ్ లో తేనెటీగ దూరినట్టు గుర్తించారు. దీంతో నాలుగు గంటలపాటు శ్రమించిన టెక్నీషియన్లు ఎలాగైతేనేం తేనెటీగను విజయవంతంగా బయటకు పంపించారు. అనంతరం విమానం ఎంచక్కా గాల్లోకి లేచింది. అయితే జరిగిన ఘటన వల్ల 156 మంది ప్రయాణీకులు ఇబ్బంది పడ్డారని, వారికి గరుడ ఎయిర్ లైన్స్ సంస్థ నష్టపరిహారం చెల్లించింది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ