పిల్లిని ఎత్తుకెళ్లిన కేసులో పాకిస్థాన్‌లోని ఫైసలాబాద్ పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. పిల్లి కోసం ముగ్గురు అరెస్టా..? అని ఆశ్చర్యపోకండి. కారణం అది మాజీ క్రికెటర్ ఇమ్రాన్‌ఖాన్ పార్టీ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ కార్యకర్త ఇంతియాజ్‌అసిఫ్‌కు చెందింది కావడమే. మరి ఆ మార్జాలం ధర తెలుసా..? అక్షరాల రూ.2 లక్షలు.
2014లో పాకిస్థాన్ ఇస్లామాబాద్‌లోని డిచౌక్‌లో జరిగిన పార్టీ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు ఇంతియాజ్ అసిఫ్ తనకెంతో ఇష్టమైన పిల్లిని తీసుకొచ్చింది. కొన్ని రోజుల క్రితం పిల్లి కనిపించక పోవడంతో పీఎంఎల్-ఎన్ పార్టీకి చెందిన ముగ్గురిపై అసిఫ్ కేసు పెట్టారు. కొన్నాళ్లు నుంచి పార్టీ మారాల్సిందిగా వారు తనను వేధిస్తున్నారని.. వారిపైనే అనుమానంగా ఉందని పోలీసులకు తెలిపింది. సోమవారం పోలీసులు ముగ్గురినీ అరెస్టు చేసి పిల్లిని అప్పగించగా.. అది తనది కాదని చెప్పింది. పార్టీ మారితే పిల్లిని తెచ్చిస్తామని గత కొన్ని రోజులుగా ఫోన్‌కాల్స్ వస్తున్నాయని ఆమె పేర్కొంది.