తప్పతాగి ఫ్లైట్ లో చిందులేసిన మోడల్

January 30, 2016 | 01:44 PM | 2 Views
ప్రింట్ కామెంట్
Blac Chyna Arrested for Public Intoxication niharonline

కల్లు తాగిన కోతిలా తప్పతాగి ఓ మోడల్ కమ్ నటి ఫ్లైట్ లో హల్ చల్ చేసింది. అమెరికాకు చెందిన టీవీ స్టార్ రాబ్ కర్దాషియన్ ప్రియురాలు, మోడల్ బ్లక్ సినా విమానంలో డాన్సులతో నానాహంగామా చేసింది. ఆపై వారించిన విమానంలోని ప్రయాణికులతో గొడవకు దిగి గందరగోళం సృష్టించింది. ఈ క్రమంలో ఆస్టిన్ విమానాశ్రయంలో ల్యాండవ్వగానే ఆమెను పోలీసులు అరెస్టు చేశారు.

                 డెల్టా విమానంలో లాక్స్ నుంచి లండన్ వరకు కర్దాషియన్, అతని ప్రియురాలు ఆస్టిన్ మీదుగా ప్రయాణించారు. విమానం ఎక్కేముందే ఆమె ఫుల్లుగా తాగింది. ఆ మత్తులో ఆమె ప్రయాణికులతో ఘర్షణ పెట్టుకుందని, అందుకే ఆమెను అదుపులోకి తీసుకుని జైలుకు పంపామని ఆస్టిన్ పోలీసులు ఓ ప్రకటనలో తెలిపారు. ఆమెపై అభియోగం కూడా మోపామని, మరిన్ని అభియోగాలు కూడా పెడతామని చెప్పారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ