బ్రెజిల్ వాసులు ఆ 12గంటలు అల్లలాడిపోయారు

December 18, 2015 | 10:58 AM | 1 Views
ప్రింట్ కామెంట్
brazil-court-lifts-ban-on-whatsapp-niharonline

ప్రస్తుతం మనిషి దైనందిన జీవితంలో సోషల్ మీడియా ఓ భాగమైపోయింది. ముఖ్యంగా ఫేస్ బుక్, వాట్సాప్ ల వాడకం ఏమేర ఉందో మనకు తెలిసిందే. కమ్యూనికేషన్లో వీటి పాత్ర అమోఘం. అలాంటి సేవలకు విఘాతం కలిగిస్తూ వినియోగదారులకు బ్రెజిల్ కోర్టు పెద్ద షాకే ఇచ్చింది. 48 గంటలపాటు కార్యకలాపాలు వాట్సాప్ సేవలను నిలిపివేయాలంటూ ఆదేశించింది. దీంతో అక్కడి ప్రజలు తీవ్ర నిరసనను తెలియజేశారు. నేర విచారణలో డేటా అందజేయడంలో ఫేస్ బుక్ ఆధ్వర్యంలో ఉన్న వాట్స్ యాప్ తరచు విఫలమవుతోందని ఆగ్రహించిన న్యాయస్థానం దానిని నిషేధించింది. న్యాయ విచారణలో న్యాయస్థానాలకు, చట్టాలకు సహకరించడం తప్పనిసరి అని గుర్తు చేస్తూ ఈ నిషేధం విధించింది. తక్షణం డ్రగ్ అక్రమ రవాణాకు సంబంధించిన సమాచారం నిలిపేయాలని, ఆ మెసేజ్ లను గుర్తించి తీసివేయాలని, లేని పక్షంలో మొత్తం వాట్సాప్ నిలిపేయాలని న్యాయస్థానం ఆదేశించింది.

                           దీని ప్రభావం 9 కోట్ల 30 లక్షల మంది వాట్స్ యాప్ యూజర్లపై పడిందని వాట్సాప్ పేర్కొంది. న్యాయస్థానం తీర్పు తమను తీవ్ర నిరాశకు గురి చేసిందని యాజమాన్యం తెలిపింది. బ్రెజిల్ స్వయంగా ప్రపంచంతో సంబంధాలు తెంపుకుందని వ్యాఖ్యానించింది. దీనిపై లీవ్ లో ఉన్న ఫేస్ బుక్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్ విమర్శలు చేశాడు. బ్రెజిలియన్లకు ఇది చాలా విచారకరమైన వార్త అని చెప్పాడు. అయితే ఈ నిషేదంపై యాజమాన్యం తిరిగి సుప్రీం కోర్టును ఆశ్రయించింది. దీంతో ఈ 48 గంటల నిషేధాన్ని ఎత్తివేయాలని అత్యున్నత న్యాయస్థానం సూచించింది. ఏదేమైనా నిషేధం ఉన్న ఆ 12గంటలు మాత్రం కోట్లాది మంది వినియోగదారులు అల్లలాడిపోయారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ