లీక్ వీరుడి కాపల కోసం కోట్లు కుమ్మరిస్తున్నారు

February 07, 2015 | 02:24 PM | 38 Views
ప్రింట్ కామెంట్
Britan_spends_huge_amount_for_Julian_Assange_security_niharonline

వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజే కు కాపలాగా కోట్లు కుమ్మరిస్తున్నారట. లండన్ లోని ఈక్వెడార్ రాయబార కార్యాలయంలో శరణార్థిగా ఉన్న ఈయనగారి రక్షణ కోసం బ్రిటన్ ఇప్పటిదాకా రూ.94.60 కోట్లను ఖర్చుచేసిందట. అసాంజే కాపలా కోసం రోజూ దాదాపు రూ.9.50 లక్షలు ఖర్చవుతోందని సమాచార హక్కు చట్టం ప్రకారం ఎల్బీసీ రేడియో అధికారిక సమాచారాన్ని సేకరించింది. అయితే ఇదంతా విదేశీ దౌత్య వ్యవహారాల రక్షణ కిందే ఆయన పొందుతున్నట్లు అక్కడి పోలీసులు తెలిపారు. స్వీడన్ లో లైంగిక ఆరోపణల కేసు ఎదుర్కొంటున్న ఆయన అసాంజే లండన్ లోని ఈక్వెడార్ దౌత్యకార్యాలయంలో 2012 నుంచి ఆశ్రయం పొందిన విషయం తెలిసిందే. దౌత్య కార్యాలయం నుంచి గనుక బయటకు వస్తే అరెస్ట్ చేసేందుకు స్కాట్ లాండ్ పోలీసులు కాపు కాసి ఉన్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ