ఆ నియంత ఉరితాడు రేంజే వేరు!

February 07, 2015 | 01:01 PM | 47 Views
ప్రింట్ కామెంట్
saddam_haning_rope_auction_niharonline

ఇరాక్ మాజీ అధ్యక్షుడు, నియంత సద్దాం హుస్సేన్‌ను ఉరితీసేందుకు వాడిన తాడును వేలం వేయనున్నారు. అయితే ఆశ్చర్యకరకంగా దీని ప్రారంభ ధరనే ఏకంగా రూ.43 కోట్లుగా నిర్ణయించారు. ఈ విషయాన్ని 'ది ఇండిపెండెంట్' పత్రిక ఒక కథనంలో పేర్కొంది. ఉరితీత కోసం ఉపయోగించిన తాడు ప్రస్తుతం మువఫ్ఫాక్ అల్-రుబాయీ అనే మాజీ మంత్రి వద్ద ఉందట. ఆయనను సద్దాం గతంలో మూడు సార్లు తీవ్రంగా హింసించినట్టు తెలిసింది. దీంతో ఆయన ఆ తాడును తన నివాసం లివింగ్ రూంలో ఉన్న సద్దాం ప్రతిమ మెడకు చుట్టి ప్రతీకారంగా ఉంచారట. ఇక ఈ తాడును సొంతం చేసుకునేందుకు ఇద్దరు కువైట్ వ్యాపారవేత్తలతో బాటు, ఓ సంపన్న ఇజ్రాయెలీ కుటుంబం, ఒక బ్యాంకు, ఇరాన్ మత సంస్థ కూడా పోటీ పడుతున్నాయి. దీంతో ఈ ఉరితాడు ప్రారంభ ధరను రూ.43 కోట్లుగా నిర్ణయించినట్టు ఆ కథనం తెలిపింది. సద్దాం హుస్సేన్‌ను బంధించి, ఇరాకీ కోర్టు తీర్పు మేరకు ఉరి తీసిన విషయం తెల్సిందే.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ