చిన్నారులు ఎంతో సులభంగా డ్రైవింగ్ చేసేలా, ఆపై పెద్దలు తమ వేలికొనలపై నియంత్రించేలా ఒక సూపర్ స్మార్ట్ కారును కొరియా సంస్థ ఒకటి రూపొందించింది. మూడు రకాల డ్రైవింగ్ మోడ్ లలో నడిచే కారును అండ్రాయిడ్ ఆధారిత మొబైల్ ఫోన్, టాబ్లెట్ తో నియంత్రించొచ్చు. బ్రూన్ ఎఫ్870 మోడల్ గా పిలువబడే ఈ కారు గంటకు 10 కిలోమీటర్ల వరకూ వేగంతో వెళ్లగలుగుతుంది. ఈ చిన్నకారులో కుదుపులు నివారించేందుకు గ్యాస్ సస్పెన్షన్ వ్యవస్థ, స్మార్ట్ టచ్ స్క్రీన్ పవర్ కంట్రోల్, చిన్నారులకు మరింత భద్రతనిచ్చేలా బకెట్ సీట్లు, ఎలక్ట్రానిక్ డిస్క్ బ్రేకులు తదితర సదుపాయాలున్నాయి. దీని ధర సుమారుగా 1000 డాలర్లుగా(మన కరెన్సీలో రూ.63 వేలు) నిర్ణయించారు.