మొరిగి తన విశ్వాసాన్ని చూపింది

December 23, 2014 | 12:48 PM | 33 Views
ప్రింట్ కామెంట్

కుక్క అన్నాక అరుస్తుంది... కరుస్తుంది... దాంట్లో విశ్వాసం ఏముంది అనుకుంటున్నారు కదా?... అమెరికాలో బడ్డీ అనే లాబ్రడార్ జాతి కుక్క పేరు ఇప్పుడు అంతర్జాలంలో మారుమోగి పోతోంది. కాలిఫోర్నియాలోని శాక్రమేంటో లో తన యజమాని ఇల్లు అగ్ని ప్రమాదంలో చిక్కుకోగా... అతడిని ప్రాణాపాయం నుంచి రక్షించిన కుక్క ఇది. అతగాడు నిద్ర పోతుండగా బెడ్ రూమ్‌కి మంటలు అంటుకున్నాయి. అయితే బడ్డీ మొరుగుతూ అతడ్ని నిద్ర లేపింది. ఆయన లేచి చూసేసరికి ఇల్లు తగులబడుతూ కనిపించింది. వెంటనే ఆయన అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ చేయడంతో వారు వచ్చి మంటలను ఆర్పారు. ఈయన ఇంట్లో స్మోక్ అలారం లేదని, కుక్క అలర్ట్ చేయడంతో ఈయన బతికిపోయారని అగ్నిమాపక సిబ్బంది చెప్పారు. స్వల్ప గాయాలకు గురైన ఆ ఇంటి యజమాని ఆసుపత్రికి వెళ్లేందుకు నిరాకరించాడు. తన విశ్వాస పాత్రమైన జాగిలాన్ని పొగుడుతున్న ఈయన దాని గురించి తన స్నేహితులకు గొప్పగా చెప్పేస్తున్నాడు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ