విలాస పురుషుడికి పెద్ద షాకే తగిలింది

December 14, 2015 | 12:49 PM | 1 Views
ప్రింట్ కామెంట్
Travers-Beynon-candyman-animal-theme-party-niharonline

ఏదైనా ఉండాల్సిందాని కన్నా ఎక్కువ ఉంటే దాని విలువ తెలియదని పెద్దలు చెబుతూ ఉంటారు. అది డబ్బైనా సరే. అయితే పైసా ఉంటే ఏదైనా చేసేయోచ్చు అని అనుకునేవాళ్లకు ఎప్పుడో ఒకసారి చిక్కులు ఎదురుకాక తప్పదు. డబ్బు దండిగా ఉందని ఓ లెవల్లో  పార్టీ చేసుకుందామని ఆలోచన ఓ ధనికుడికి ఇప్పుడు తిప్పలు తెచ్చిపెట్టింది. ఆస్ట్రేలియాలో టొబాకో దిగ్గజం ట్రావెర్స్‌ బెనాన్‌ డబ్బు కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతుండడంతో ఏం చేయాలో తెలియక తన స్నేహితులకు నిత్యం పార్టీలు ఇస్తూ తగలేస్తుంటాడు. అయితే మాములుగా కాకుండా ప్రతీసారి ఓ వెరైటీ ఇవ్వటం అతనికి అలవాటు. దానికి అతను ముద్దుగా పెట్టుకున్ పేరు క్యాండిమన్‌. ఇక పార్టీ అయ్యాక ఆ ఎంజాయ్ మెంట్ ఫోటోలను సోషల్ నెట్ వర్క్ లో పోస్ట్ చేసి ఆనందిస్తూ ఉంటాడు. అందమైన ఆడవాళ్ల మధ్య అడ్డదిడ్డమైన ఫోజులు, అవసరమయితే నగ్నమైన ఫోటోలు దిగి షేర్ చేయటం అతనికి అలవాటే.

అదే క్రమంలో బెనాన్‌ ఈ వీకెండ్‌లో ఇంకా కొత్తగా ఏనిమల్‌ థీమ్‌ అనే ఓ పార్టీ ఇచ్చాడు. శనివారం మధ్యాహ్నం నుంచి ఆదివారం ఉదయం వరకు ఈ పార్టీ జరిగింది. మత్తెక్కించే మద్యంతో పాటు కైపెక్కించే బికినీ భామలు కామన్‌ అతని ప్రతీ పార్టీలో కామన్. వారందరూ హెలీకాఫ్టర్‌ నుంచి డైరెక్టుగా స్విమ్మింగ్‌ ఫూల్‌లో ల్యాండ్‌ అయి అక్కడి వారికి అందాల విందు ఇస్తారు. ఈ పార్టీకీ 5 కోట్ల రూపాయలను అతను తగలేశాడట. ఏనిమల్ థీమ్ కదా అందుకని ఏనుగు, మొసలి, కొండముచ్చులను కూడా ఈ పార్టీకి ఆహ్వానించాడు. ఆహుతులంతా మద్యం మత్తును ఆస్వాదిస్తూ తూలిపోతుంటే బికినీ బేబీలతో కలిసి సదరు జంతువులు కూడా వారిని అలరించాయి. ఈ ఫోటోలను కూడా యథావిధిగా బెనాన్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసి బుక్కయ్యాడు. మూగజీవాలను పార్టీ పేరుతో హింసిస్తున్నాడంటూ మూగజీవాల సంరక్షణ సంఘాలు అతనిపై పోలీస్ ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు అతనిపై కేసు నమోదు చేసి అరెస్ట్ కోసం వెతుకుతున్నారు.  

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ