తాగటం కన్నా యమడేంజర్ ఇంకోటి ఉందట

December 12, 2015 | 05:19 PM | 2 Views
ప్రింట్ కామెంట్
too-much-sleep-dangerous-than-consuming-alcohol-niharonline

అతిగా మద్యం సేవించడం, పొగతాగడం ప్రాణాలకు ముప్పు అన్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే, అతిగా తాగటం కన్నా మహా ముప్పు మరోకటి పొంచి ఉందని శాస్త్రవేత్తలు తేల్చి చెప్పారు. అదే నిద్ర. రోజుకు తొమ్మిది గంటలకు మించి నిద్రపోతే తొందరగా చచ్చిపోతామట. సిడ్నీ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు 2,30,000 మంది ఆరోగ్య పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలించిన  ఈ నిర్ధారణకు వచ్చారు.

అతిగా మద్యపానం, ధూమపానం చేసిన వారి కంటే అతిగా నిద్రపోయేవారు చనిపోవడానికి రెండు రెట్లు ఎక్కువ అవకాశం ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. దీనికితోడు ఎక్కువ నిద్రపోయేవారు, ఎక్కువసేపు కూర్చునేవారు చనిపోవడానికి ఉండే అవకాశాలు సాధారణ వ్యక్తుల కంటే నాలుగు రెట్లు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యకరమైన అలవాట్లు కలిగిన వారు సరాసరి ఆరు గంటలు పడుకుంటే క్షేమదాయకమని, మద్యం సేవించే వారు ఏడు గంటలు పడుకోవడం మంచిదని శాస్త్రవేత్తలు తెలిపారు. సో... అతిగా నిద్ర పోవటం అనర్థదాయకం ఫ్రెండ్స్.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ