అప్పుడేప్పుడో కూలి... ఇప్పుడు దొరికింది

February 10, 2015 | 03:46 PM | 26 Views
ప్రింట్ కామెంట్
chile_green_gross_football_team_accident_flight_after_more_years_niharonline

చిలీలో అర్ధ శతాబ్దం కిందట కూలిన ఓ విమానం ఆచూకీ లభ్యమైంది. ఆండీస్ పర్వాతాలలో 54ఏళ్ల క్రితం అదృశ్యమైన విమానం శిథిలాలను కొందరు పర్వతారోహకులు గుర్తించారు. వీరిలో 8 మంది ఫుట్ బాల్ ప్లేయర్లతో సహా మొత్తం 24 మంది ప్రయాణికులు మృతి చెందారు. శాంటియాగోకి 360 కిలోమీటర్ల దూరంలోని 3200 మీటర్ల ఎత్తులో పర్వతాలపైన విమానం శిథిలాలను కనుగొన్నట్లు పర్వతారోహకులు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. ఏప్రిల్ 3, 1961న చిలీ ఫుట్‌బాల్ జట్టు సభ్యులు ప్రయాణిస్తున్న విమానం అదృశ్యమైంది. ఈ ఘటన దక్షిణ అమెరికాలోనే కాకుండా క్రీడా ప్రపంచానికి ఒక జవాబులేని ప్రశ్నలా మిగిలిపోయింది. ఫుట్‌బాల్ జట్టు విదేశాల్లో ఫుట్‌బాల్ ఆడి శాంటియాగో తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గ్రీన్ క్రాస్ జట్టు సభ్యులు రెండు బృందాలుగా రెండు విమానాల్లో బయలుదేరారు. ఒక గ్రూప్‌లోని వారు సురక్షితంగా చేరగా, మరో గ్రూప్ సభ్యులు ప్రయాణిస్తున్న విమానం అదృశ్యమైంది. అప్పట్లో వీరి కోసం ముమ్మర గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ లాభం లేకపోయింది. దీంతో అదృశ్యమైన విమానం మిస్టరీగానే మిగిలిపోయింది. ప్రదేశమంతా అస్థిపంజరాలతో భయానకంగా ఉందని పర్వతారోహకులు చెప్పారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ