ఎంతోమంది మగధీరుల విజయాల వెనుక అతివల హస్తం ఉంటుందని ముచ్చట. చైనాలో తేయాకు వ్యాపారస్థుడు ఒకాయన కన్యలను ఎంపిక చేసి... వారి చేతులతోగాక అధరాలతో ఆకులు పీకించి, ఆ ప్రక్రియకు భారీ ప్రచారం కలిపించేరు. అమ్మాయిల పుణ్యమా అని అమ్మకాలు బాగానే ఊపందుకున్నాయట.
ఏదో ఊహాలోకాల్లో తేలిపోయే మగ అర్భకులు వయో బేధం లేకుండా లొట్టలేసుకుంటూ కప్పు మీద కప్పు తాగుతారంటే ఓకే. మరి సాటి ఆడంగులు ఇష్టపడతారా... అనేది వేచి కాచి చూడాలి. మొగుళ్లతో తాగనిస్తారా లేక బ్రహ్మచారులకే పరిమితమా? ఈ విధంగా పురుషుల్ని ఆకులు పీకే ఉద్యోగానికి నియమిస్తే ఆడవారి ఆశీర్వచనం తో అమ్మకాలు పెరుగుతాయంటారా? అపుడింట్లో పెళ్లాలు తాగితే గృహ హింసకు నాంది పలకదా? మరి ట్రాన్స్ జెండర్స్ విషయమేమిటి? ఇన్ని ధర్మసందేహాలు పరిమళించే బదులు ఫలానీ హోటల్లో అందగత్తెలు ఛాయ్ మేళా నిర్వహించి సగం తాగిన ఛాయ్ ఆఫర్ చేస్తున్నారు. రేటు మీ ఇష్టం అని ప్రకటన ఇస్తే ఎలా ఉంటుంది?