ప్రపంచంలో గూగుల్ కంపెనీ కి ఉన్న స్థాయి ఏంటో అందరికీ తెలుసు. అంతర్జాతీయ ఖ్యాతి గాంచిన అలాంటి కంపెనీలో ఓ భారతీయుడికి స్థానం అది కూడా ఓ కీలక పొజిషన్ లో దొరుకుతుందని బహుశా ఎవరూ ఊహించి ఉండరు. ఇప్పటికే మైక్రోసాఫ్ట్ సీఈవోగా సత్యనాదెళ్ల నియమితులై రాణిస్తుంటే, ఇప్పుడు మరో భారతీయుడు గూగుల్ సీఈవోగా బాధ్యతలు చేపట్టనున్నాడు.
తమిళనాడులోని చెన్నై లో 1972లో జన్మించిన సుందర్ పిచాయ్ గూగుల్ సీఈవోగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఐఐటీ ఖరగ్పూర్ నుంచి బీటెక్ చేసిన ఆయన స్టాన్ ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుంచి ఎంఎస్ను.. వార్టన్ స్కూల్ ఆఫ్ పెన్సిల్వేనియా వర్సిటీ నుంచి ఎంబీఏ పూర్తి చేశారు. గూగుల్ లో 2004లో చేరిన సుందర్ అంచలంచెలుగా ఎదిగాడు.. ఒక భారతీయుడు.. అందునా దక్షిణాకి ప్రాంతానికి చెందిన వ్యక్తి గూగుల్ సీఈవోగా ఎంపిక కావటం ఒక ప్రత్యేకత అయితే.. సత్యానాదెళ్ల అనంతపురం జిల్లా బుక్కాపురం వాసి కాగా, సుందర్ తమిళనాడుకు చెందిన వ్యక్తి. ఇక్కడ ఇద్దరూ దక్షిణాది ప్రాంతానికి చెందిన వారు కావటం గమనార్హం.
కాగా, ఇంటర్నెట్ సెర్చింజన్‌గా సేవలను ప్రారంభించిన గూగుల్, ఆపై డ్రోన్ల తయారీ, ఫార్మా, వెంచర్ కాపిటల్ ఇలా పలు రంగాలకు విస్తరించింది. తాజాగా కొత్తగా వినూత్న ప్రొడక్టులను కనుగొని వాటిని అభివృద్ధి చేసే నిమిత్తం గూగుల్ అల్ఫాబేట్ పేరిట కొత్త సంస్థను ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సుందర్ పిచాయ్ సీఈవోగా ఉంటారు. అల్ఫాబేట్ పేరిట కొత్త జీవితం ప్రారంభమైందని, తనకు, సెర్గీకి ఇది ఎంతో ఆనందకరమైన రోజని గూగుల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ లారీ పేజ్ అన్నారు.