ఆడది ఆటవస్తువే కాదు.. ఆఫీసు వస్తువు కూడా...

August 25, 2015 | 04:47 PM | 3 Views
ప్రింట్ కామెంట్
China_companies_cheerleaders_motivate_male_employees_niharonline

చీర్ గర్ల్స్... ఐపీఎల్ వచ్చాక ఈ పేరు మారు ఎంతలా మారుమ్రోగిపోయిందో మనందరికీ తెలిసిన విషయం. ఆటలో అలసి సొలసి ఉన్న ఆటగాళ్లను ఉత్సాహ పరిచి వారిలో ఎక్కడా లేని ఎనర్జీని రెక్కెత్తించేందుకు అందమైన అమ్మాయిలతో స్టెప్పులేయించటం చూస్తూనే ఉన్నాం. ఓవైపు ఆటగాళ్లతోపాటు ప్రేక్షకులు, మరీ ముఖ్యంగా కెమెరామెన్ చీర్ గర్ల్స్ ఫీట్ ను బాగా ఎంజాయ్ చేస్తుంటారు. ఇప్పుడు ఇదే ట్రిక్ వాడి చైనా టెక్నికల్ గా ముందుకు వెళ్లాలని చూస్తోంది.

                    చైనాలోని టెక్ కంపెనీలు తమ కంపెనీల్లో పని చేస్తున్న పురుష ఉద్యోగులను ఉత్సాహపరిచేందుకు చీర్ లీడర్స్ ను రంగంలోకి దింపుతున్నారు. తద్వారా పని చేస్తూ ఉంటే పొట్టి స్కర్టులు ధరించిన అందమైన అమ్మాయిలు దగ్గరికి వస్తారు. వారిని అలరిస్తూ మాట్లాడుతారు. ఏమైనా కావాలా అని అడిగి తెలుసుకుంటారు. దానిని క్షణాల్లో తీసుకు వస్తారు. నవ్విస్తారు, అవసరమైతే ఆటలాడుతారు. ఉద్యోగులను ఉత్సాహపరిచి వారి నుంచి మరింత ఉత్పాదకతను రాబట్టేందుకు చైనాలోని టెక్నాలజీ కంపెనీలు ఈ కొత్త మార్గాన్ని పాటిస్తున్నాయి. వీరిని ఐటీ ఇండస్ట్రీలో 'ప్రోగ్రామింగ్ చీర్ లీడర్స్' అని పిలుస్తారు. చైనాలో పలు ఐటీ కంపెనీలు ప్రస్తుతం వీరిని నియమించి ఉద్యోగులకు ఉల్లాసం కలిగిస్తున్నాయని ట్రెండింగ్ ఇన్ చైనా ప్రకటించింది. అందమైన అమ్మాయిలను నియమించిన తర్వాత కంపెనీ వాతావరణం మారిందని, ఉద్యోగులు, ముఖ్యంగా పురుష ఉద్యోగులు మరింత ఉత్సాహంగా పని చేస్తున్నారని, ప్రొడక్టివిటీ పెరిగిందని ఓ కంపెనీ చెబుతున్నారు. గతంలో ఫ్యాక్టరీల్లో మరింత ఉత్పత్తి కోసం విరామ సమయాల్లో కార్మికులకు అమ్మాయిలను ఎరవేసిన చరిత్ర కూడా చైనాకు ఉంది.  

               నాణేనికి మరో కోణం ఉన్నట్లే  ఈ నిర్ణయం పట్ల అక్కడి మహిళా సంఘాలు తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నాయి. పని పట్ల చిత్తశుద్ధి చాలు కానీ, అందంగా ఉన్న అమ్మాయిలను చూసి పనులు చేస్తారా? అని వారు నిలదీస్తున్నారు. ఇంతకీ మన దగ్గర ఆ సౌలభ్యం కల్పిస్తే జనాలు పనిచేస్తారంటారా? అన్నిటికీ ఆడదే ఆధారం మరి!

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ