ఐ ఫోన్ కోసం ఓ తండ్రి చేసిన దారుణం

March 09, 2016 | 05:48 PM | 3 Views
ప్రింట్ కామెంట్
china-father-sold-baby-for-iphone-niharonline

జంతువులు కూడా తాము కని పెంచిన పిల్లల్ని కొద్దిరోజులుగా జాగ్రత్తగా సాకుతాయి. శత్రువుల బారిన పడకుండా కంటికి రెప్పలా సాకుతాయి. కానీ, ఇక్కడో ప్రబుద్ధుడు మాత్రం జన్మించి మూడు వారాల‌యినా నిండ‌ని క‌న్నకూతుర్నే అమ్మేసి ఐఫోన్‌, మోటార్‌సైకిల్ కొనుగోలు చేయాల‌నుకున్నాడు.

చైనాలో 19 సంవ‌త్స‌రాల ఏడ్వాన్ చైనాలోని పాపుల‌ర్ మెసేజింగ్ యాప్ క్యూక్యూ ద్వారా త‌న‌ బిడ్డ‌ను బేరానికి పెట్టి, ఈ డీల్ గురించి త‌న‌ భార్య‌కు చెప్ప‌కుండానే అమ్మేశాడు. మెసేజింగ్ ఆప్ ద్వారా బేర‌మాడి చైనాలోని టోంగాన్ సిటీలో త‌న బిడ్డ‌ను ఓ వ్య‌క్తికి 3,500 డాల‌ర్ల‌కు అమ్మేశాడు. అయితే, శిశువు గ‌ర్బంలోనే ఉండ‌గానే త‌ల్లి పుట్ట‌బోయే త‌న బిడ్డ‌ను విక్ర‌యించ‌డానికి ఒప్పుకుంద‌ట‌. శిశువు జ‌న్మించిన తర్వాత ఐఫోన్ కోసం త‌న భ‌ర్త బిడ్డ‌ను అమ్మేశాడ‌ని తెలుసుకొని బాధ‌ప‌డి సిటీ అంతా గాలించింది.

                        చివ‌రికి పోలీసుల‌కు ఈ విష‌యం తెలియడంతో ఈ విష‌యం వెలుగులోకొచ్చింది. ఆర్థికప‌ర‌మైన ఇబ్బందులు, పిల్ల‌ల్ని పోషించే స్థోమ‌త లేక అక్క‌డ చాలామంది త‌మ బిడ్డ‌ల్ని అమ్ముకుంటున్నారని అధికారులు తెలిపారు. త‌ల్లితండ్రుల‌ను అరెస్ట్ చేసిన పోలీసులు వారికి జైలు శిక్ష విధించారు. కొనుగోలు చేసిన వారి ద‌గ్గ‌రే ఇప్పుడు ఆ బిడ్డ పెరుగుతోంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ