కవలపిల్లలే కానీ, తండ్రి మాత్రం...

March 09, 2016 | 11:54 AM | 3 Views
ప్రింట్ కామెంట్
viatnam-twins-bipaternal-niharonline

కవలపిల్లలు పుట్టారని ఆనందిస్తున్న తండ్రికి నిద్ర లేకుండా చేశారు డాక్టర్లు. రెండేళ్ల తర్వాత తన భార్య చేసిన నమ్మకద్రోహన్ని భర్తకు చెప్పి షాక్ కి గురిచేశారు. విచిత్రమేంటంటే.. పుట్టింది కవలలే అయినా తండ్రులు మాత్రం వేరంట. వినడానికి విచిత్రమయిన ఈ ఘటన వియ‌త్నంలో జరిగింది. ఉత్తర హోవా బిన్హ్ ప్రావిన్స్ లోని ఓ దంపతులకు రెండేళ్ల క్రితం కవలపిల్లలు జన్మించారు. అయితే రెండేళ్ల తర్వాత వారిలో ఒకరు లావుగా ఉంగరాల జుట్టుతో ఉండగా, మరోకరు సన్నగా ఉండటంతో భర్తకు అనుమానం వచ్చింది. అంతే దగ్గర్లోని ఓ హాస్పిట‌ల్‌లో ఆ క‌వ‌ల‌లకు డీఎన్ఏ టెస్ట్ చేశారు. అంతే వైద్యులు ఇచ్చిన రిపోర్ట్ తో అంద‌రూ ముక్కున వేలేసుకున్నారు.

                            అయితే  హాస్పిట‌ల్‌లో పుట్టినప్పుడు కవలలను మార్చారా అని అనుమానాలు వచ్చినప్పటికీ, వీరిద్దరూ ఆ తల్లికి  పుట్టిన బిడ్డలే అని డాక్టర్లు నిర్ధారణ చేశారు. దీంతో తల్లి ఒక్కటే కానీ, తండ్రులు వేరని తేలింది. ఇలా పుట్టిన వారిని బైపేట‌ర్నల్ ట్విన్స్ (వేర్వేరు తండ్రులకు జన్మించిన కవలలు)గా వ్యవ‌హ‌రిస్తారు. ఒక స్త్రీ ఇద్దరు పురుషులతో శారీరక సంబంధం కలిగి వుంటే ఇలాంటి ఇలాంటి కవలలు జన్మించే అవకాశం వుందని వైద్యులు తెలిపారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ