చెంచా షుగర్ తో 80 గంటలు కరెంట్!!!

November 02, 2015 | 03:58 PM | 3 Views
ప్రింట్ కామెంట్
Chinese-students-develop-highly-efficient battery-with-spoon-sugar-niharonline

చిన్న చిన్న అంశాలతో అద్భుతాలు చేయటం మన యువతకు కొత్తేం కాదని మరోసారి రుజువైంది. ఒక చెంచా చక్కెరను మీకు ఇస్తే ఏం చేస్తారు? టక్కున నోట్లో వేసుకుని మింగేస్తారా. మరదే కక్కుర్తి అంటే. ఇక్కడో ఓ విద్యార్థి బృందం మాత్రం ఆ చెంచాడు స్పూన్ తో అద్భుతం సృష్టిస్తోంది. ఏకంగా 80 గంటల పాటు 520 మిల్లీ వాట్ల విద్యుత్ ను అందించే వ్యవస్థను రూపొందించారు. చైనాలోని తియాంజిన్ యూనివర్శిటీ విద్యార్థులు ఈ ఆవిష్కరణకు రూపకర్తలయ్యారు.

                    ముందుగా ఈకోలి, షెవానెల్లా, బి సబ్టిలిన్ అనే సూక్ష్మజీవుల కలయికలో ఓ వ్యవస్థను తయారు చేశారు. దానికి చెంచా షుగర్ ను చేర్చారు అంతే. ఇది సాధారణ లీథియం బ్యాటరీకి సమానంగా నిలిచింది. తద్వారా గంటపాటు కొనసాగే అత్యధిక సామర్థ్యమున్న సూక్ష్మజీవి కణ వ్యవస్థను రూపొందించారు. మొత్తం 19 మంది కాలేజీ, హైస్కూలు విద్యార్థుల బృందం ఈ మైక్రో సిస్టమ్ ను తయారు చేసింది. కాలుష్యం రహిత బ్యాటరీ తయారీ వ్యవస్థను కనిపెట్టి 2015 సంవత్సరానికిగాను ఐజేఎం (ఇంటర్నేషనల్ జనటికల్లీ ఇంజనీర్డ్ మెషీన్) పోటీల్లో బంగారు పతకాన్ని సైతం సాధించింది ఇదే బృందం. ఇక ఇప్పుడు పంచదారతో ఎక్కువ విద్యుత్ ను తయారు చేసే పనిలో ఫుల్ బిజీగా ఉన్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ