హవ్వా! ఇలాంటి ఉద్యోగ ప్రకటన ఎప్పుడైనా చూశారా?

April 16, 2016 | 04:46 PM | 4 Views
ప్రింట్ కామెంట్
Danish-Club-Porn-Jay-Watch-XXX-Videos-niharonline

పోర్న్ పై ఒక్కో దేశాలు నిషేధం దిశగా అడుగులు వేస్తున్న ఈ సమయంలో ఇక్కడ ఓ ఉద్యోగ ప్రకటన చూస్తే ఎవరైనా కంగు తినాల్సిందే. డెన్మార్క్‌లోని ఓ కంపెనీ ఓ విచిత్రమైన ఉద్యోగం కోసం ప్రకటన విడుదల చేసింది. వారానికి 20 గంటల పాటు పోర్న్ సినిమాలు చూస్తే రూ. 2.22 లక్షల జీతం ఇస్తామని ఓ క్లబ్ చెబుతోంది.

వాళ్లకు కావాల్సిన అర్హతలు చూసి ఎంపికైన అభ్యర్థులకు కంప్యూటర్, బోలెడన్ని డీవీడీలు, ఆఫీసులో కూడా ప్రత్యేకమైన స్థలం అన్నీ ఇస్తారట. అయితే అభ్యర్థులకు ఎలాంటి అర్హతలు ఉండాలనే విషయంపై మాత్రం ఇంతవరకు స్పష్టత ఇవ్వలేదు. ఓపెన్ మైండెడ్ అయి ఉండాలని, ఈ తరహా సినిమాలు చూడటంలో అనుభవం కూడా ఉండాలని మాత్రం హార్న్‌స్లెత్ బార్ చెబుతోంది.

                 తామిచ్చిన ప్రకటనకు స్పందన అమోఘంగా ఉందని, ఇప్పటికే ఫేస్‌బుక్, ఈమెయిల్ ద్వారా వేలాది దరఖాస్తులు వచ్చాయని బార్ ఫౌండర్ క్రిస్టియన్ వాన్ హర్న్‌స్లెత్ చెప్పారు. ఏదో సరదాగా వచ్చేవాళ్లను కాకుండా, దీన్ని సీరియస్‌గా ఉద్యోగంలా చూసేవాళ్లను మాత్రమే ఎంపిక చేసుకుంటామన్నారు. వాళ్లకు 'డీజే' లాగే 'పీజే(పోర్న్ జాకీ)' అనే టైటిల్ ఇస్తామన్నారు. 18 సంవత్సరాలకు పైబడిన దరఖాస్తుదారులు తాము ఎందుకు ఇతరుల కంటే మంచి పోర్న్ జడ్జి అవుతామో వివరిస్తూ ఈమెయిల్ రాయాలని తెలిపారు. ఇదంతా కేవలం పబ్లిసిటీ మాత్రమే కాదని, తమ బార్ ఈ విషయంలో చాలా సీరియస్‌గా ఉందని చెప్పారు. తమకు పోర్న్ సినిమాల నుంచి కనీసం 50-60 గంటల ఆడియో కావాలని, ప్రధానంగా శబ్దాలే అవసరమని చెబుతున్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ