ఆ ముగ్గురు స్నేహితులే. అయితే అమ్మాయి అయినప్పటికీ తోటి స్నేహితురాలిపై అఘాయిత్యం జరుగుతుంటే అడ్డుకోకపోగా, దాన్ని వీడియో తీసి సోషల్ మీడియా పంచుకుంది. 'పెరిస్కోప్' ద్వారా మొత్తం ఘటనను లైవ్ లో పంచుకున్న 18 ఏళ్ల టీనేజ్ యువతి జీవితం దాదాపు జైల్లోనే గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది.
యూఎస్ లోని ఓహియోలో ఈ ఘటన చోటుచేసుకుంది. మరీనా లోనినా (18), 17 ఏళ్ల టీనేజ్ అమ్మాయి, 29 ఏళ్ల రేమాండ్ గేట్స్ ఒకే వీధిలో ఉంటూ స్నేహంగా ఉండేవారు. గత నెల 27న 17 ఏళ్ల స్నేహితురాలిపై రేమాండ్ అత్యాచారం చేస్తుంటే, లోనినా ఆ దృశ్యాలను పెరిస్కోప్ సహాయంతో ప్రత్యక్ష ప్రసారం చేసింది. దీన్ని చూసిన వారి మిత్రుడు ఒకరు పోలీసులకు సమాచారం చేరవేశాడు. దీంతో లోనినా, గేట్స్ లను అదుపైలోకి తీసుకున్న పోలీసులు వారిపై కేసు పెట్టారు. అత్యాచారం, కిడ్నాప్, లైంగిక వేధింపులు, మైనర్ బాలికపై కామవాంఛ తీర్చుకోవడం వంటి సెక్షన్ల కింద కేసు పెట్టగా, ఇద్దరికీ 40 సంవత్సరాల జైలు శిక్ష పడే అవకాశాలు ఉన్నాయని ఓబ్రియన్ వెల్లడించారు.