నమ్మి తీరాలి: ఓనర్ కాల్చిన కుక్క

October 28, 2015 | 10:23 AM | 3 Views
ప్రింట్ కామెంట్
dog-trigger-shoot-owner-with-gun-niharonline

విశ్వాసంలో కుక్కను మించింది లేదు. కాస్త ప్రేమను కురిపిస్తే చాలు ప్రాణాలు సైతం ఇవ్వటానికి వెనకాడని శునక వీరగాథలు మనం ఎన్నో చదివి, చూసి ఉంటాం. కానీ, ఇక్కడో కుక్క యజమానినే కాల్చింది. అయితే ఓ కుక్క మనిషిని, అది తుపాకీతో ఎలా కాల్చిందనేగా మీ అనుమానం? అయితే ఇది చదవండి.

                    యూఎస్ లోని ఇండియానాకు చెందిన ఇల్లీ కార్టర్ అనే మహిళ ఓ కుక్కను పెంచుకుంటోంది. దానికి ముద్దుగా 'ట్రిగ్గర్' అని పేరు కూడా పెట్టింది. వారం క్రితం ఆమె సమీపంలోని అడవికి వేటకు వెళ్లింది. కూడా ట్రిగ్గర్ ను కూడా తన వెంట తీసుకుని వెళ్లింది. కాసేపయ్యాక బుల్లెట్లతో నింపిన తుపాకీ 'ట్రిగ్గర్' అన్ లాక్ చేసి, నేలమీద పెట్టి తన పనిలో మునిగిపోయింది. యజమాని చుట్టూ తిరుగుతున్న ట్రిగ్గర్, పొరపాటున తుపాకీ ట్రిగ్గర్ పై కాలు వేసింది. అంతే... తుపాకీ ఒక్కసారిగా పేలిపోయింది. బుల్లెట్ నేరుగా వెళ్లి యజమాని కాలిలోంచి చొచ్చుకుపోయింది. అయితే ఆమె ప్రాణాపాయం నుంచి బయటపడింది. ఇందులో ట్రిగ్గర్ తప్పేం లేదని జాగ్రత్తగా ఉండాల్సింది, తన నిర్లక్ష్యమే కారణమని ప్రమాదం తర్వాత కార్టర్ మీడియాకు తెలిపింది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ