ఇండోనేషియాలో భారీ భూకంపం?

December 09, 2015 | 05:02 PM | 2 Views
ప్రింట్ కామెంట్
earth-quake-in-indonesia-niharonline

ఇండోనేషియాలో కాసేపటి క్రితం పెను భూకంపం సంభవించింది. 7.1 తీవ్రతతో వచ్చిన ఈ భూకంపం ధాటికి ఇండోనేషియా చిగురుటాకులా వణికిపోయింది. ఆగ్నేయ ఇండోనేషియాకు 174 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం నమోదయినట్లు ఆస్ట్రేలియన్ వాతావరణ శాఖ ప్రకటించింది. తీవ్రత ఎక్కువగా ఉండడంతో నష్టం జరిగే అవకాశం కనిపిస్తోంది. అయితే సునామీ అవకాశాలను మాత్రం అధికారులు కొట్టిపారేశారు. కాగా, భూకంప ప్రభావంపై, పూర్తి నష్టంపై మరింత సమాచారం తెలియాల్సిఉంది. హిందూ మహసముద్రంతోపాటు ఫసిఫిక్ లో కూడా ఈ మధ్య తరచూ భూప్రకంపనలు సంభవించుతుండటంతో తీర దేశాల ప్రజలు భయం గుప్పిట్లో అల్లలాడిపోతున్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ