హ్యాకర్ కు భారీ నజరానా ఇచ్చిన ఫేస్ బుక్

May 05, 2016 | 01:59 PM | 3 Views
ప్రింట్ కామెంట్
FB-Huge-reward-10-year-old-for-hacking-Instagram

సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ తమ అనుబంధ సైట్ అయిన ఇన్ స్టాగ్రామ్ ను హ్యాక్ చేసిన ఓ వ్యక్తికి భారీ నజరానాను ప్రకటించింది. ఎందుకు అంటారా?  త‌మ వెబ్‌సైట్‌లో ఉన్న లోపాలను తొల‌గించ‌డానికి ఫేస్‌బుక్ సంస్థ బగ్‌ బౌంటీ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇందులో భాగంగా ప్రపంచవ్యాప్తంగా పలువురు సాఫ్ట్‌వేర్ నిపుణులు, యువ‌త పాల్గొని, అందులోని లోపాలను ఎత్తి చూపుతున్నారు. అలా చేసిన వారికి నిర్వాహ‌కుల నుంచి భారీగా న‌గ‌దు బ‌హుమ‌తులు పొందుతున్నారు. తాజాగా ఆ లిస్ట్ లో  ఓ పదేళ్ల‌ బుడ‌త‌డు కూడా చేరిపోయాడు.

                                        ఫేస్‌బుక్ అనుబంధ‌ సామాజిక మాధ్యమం ఇన్‌స్టాగ్రామ్‌లో బ‌గ్‌ను క‌నుగొన్నందుకుగానూ ఓ ప‌దేళ్ల బాలుడు స‌ద‌రు సంస్థ‌నుంచి 10వేల డాల‌ర్లు(రూ.6.6ల‌క్షలు) బ‌హుమానంగా పొందాడు. ఫిన్‌లాండ్‌కు చెందిన ఈ బాలుడి పేరు జానీ. ఇన్‌స్టాగ్రామ్‌లో సెక్యూరిటీ లోపాన్ని క‌నుగొని, దానికి ప‌రిష్కారం క‌నుగొన్నాడు. ఈ బాలుడు గుర్తించిన బ‌గ్ ఇన్‌స్టాగ్రామ్‌లో కంటెంట్‌ను, కామెంట్ల‌ను డిలేట్ చేయ‌డానికి అనువుగా ఉన్న లోపంతో ఉంది. దానికి చ‌క్క‌ని ప‌రిష్కారాన్ని సైతం క‌నుగొన్నాడు జానీ. అనంత‌రం తాను క‌నుగొన్న బ‌గ్‌తో పాటు దానికి ప‌రిష్కార మార్గాన్ని తెలుపుతూ ఫేస్‌బుక్‌కు మెయిల్ చేశాడు. జానీ పనితనానికి మెచ్చిన ఫేస్ బుక్ యాజమాన్యం అతడిని పదివేల డాలర్ల చెక్కును అందజేసి సత్కరించింది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ