ట్రంప్ గాడిద పండగ చేసింది

May 03, 2016 | 05:23 PM | 1 Views
ప్రింట్ కామెంట్
trumph-donkey-festival-niharonline

ఒక విషయం గురించి అవగాహన కల్పించేందుకు రక రకాల పద్ధతులను అవలంభిస్తుంటాం. సోషల్ మీడియా తోపాటు పలు కార్యక్రమాల ద్వారా ఇది జరుగుతుంటుంది. సరిగ్గా ఇదే కోవలోకి వచ్చే ఒక అవగాహన కార్యక్రమం మెక్సికోలోని ఒక చిన్న ప్రాంతమైన ఒటుంబలో జరిగింది. జంతువుల గురించి ఆ ప్రాంతంలో వారికి అవగాహన కల్పించేందుకు గాను ప్రతి ఏటా ఒక కార్యక్రమం నిర్వహిస్తుంటారు. ముఖ్యంగా గాడిదలు గురించి ఈ వార్షిక పండగలో ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన గాడిదల రేసు నిర్వహిస్తుంటారు. యజమానులు తమ గాడిదలను సుందరంగా అలంకరించి వింత వేషధారణలతో ఇక్కడికి తీసుకొస్తూ ఉంటారు. అందరినీ ఆకట్టుకున్న గాడిదకు ఉత్తమ బహుమతి ఇస్తుండటం పరిపాటి. ఈ పండగలో సుమారు నలభై వేల మంది వరకు పాల్గొంటూ ఉంటారు. సందర్శకులను అలరించేందుకుగాను కొంత మంది ఔత్సాహికులు గాడిదల వేషాధారణల్లో దర్శనమిస్తుంటారు. ఈ ఏడు జరిగిన పోటీల్లో అమెరికా అధ్యక్ష పదవిలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ వేషధారణలో ఒక గాడిదను అలంకరించారు. ఈ దఫా వేడుకల్లో ట్రంప్ గాడిదే హైలెట్ అయ్యింది. అదండీ మ్యాటర్.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ